News August 1, 2024
ట్రంప్ గెలిస్తే యూఎస్‌తో దోస్తీకి కిమ్ గ్రీన్ సిగ్నల్?

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికాతో చర్చలకు కిమ్ సర్కార్ సానుకూలంగా ఉందని ఉత్తరకొరియా మాజీ దౌత్యవేత్త రీ ఇల్ గ్యూ పేర్కొన్నారు. USతో చర్చలు జరిపి అణు ప్రయోగాలపై ఆంక్షలను తొలగించుకోవాలని ఉ.కొరియా ప్లాన్ చేస్తోందట. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందనే ముద్రను చెరిపించుకుని నిధులకు లైన్ క్లియర్ చేసుకోవాలని భావిస్తోందట. క్యూబాలో విధులు నిర్వహించే రీ గత ఏడాది కుటుంబంతో సౌత్ కొరియాకు పరారయ్యారు.
Similar News
News March 11, 2025
శబరిమల: 18 మెట్లు ఎక్కగానే స్వామి దర్శనం

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. అక్కడి అయ్యప్ప గుడిలోని సన్నిధానంలో 18 మెట్లను ఎక్కగానే స్వామి దర్శనం అయ్యేలా మార్పులు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, విజయవంతమైతే రానున్న మండల మకరవిళక్కు సీజన్ నుంచి కొనసాగిస్తామంది. సాధారణంగా మెట్లు ఎక్కగానే భక్తులను ఓ వంతెన మీదికి మళ్లించి కొంత సమయం క్యూలో ఉంచిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు.
News March 11, 2025
WPL: గెలిస్తే నేరుగా ఫైనల్‌కు

WPL 2025లో ముంబై ఇండియన్స్ మరోసారి ఫైనల్‌కి చేరువైంది. ఇవాళ బెంగళూరుతో జరిగే మ్యాచులో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరనుంది. నిన్నటి మ్యాచులో గుజరాత్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో MI(10P) రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఢిల్లీకీ 10 పాయింట్లే ఉన్నా NRR ఎక్కువ ఉండటంతో తొలి స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచులో MI ఓడితే ఎలిమినేటర్‌లో గుజరాత్‌తో తలపడనుంది.
News March 11, 2025
ఆర్థికమాంద్యం ముప్పులో అమెరికా!

అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ నిబంధనలతో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని ఇన్వెస్టర్లు భావించడంతో నాస్‌డాక్ 4 శాతం క్షీణించింది. 2022 తర్వాత ఒక్కరోజులో అతిపెద్ద నష్టం ఇదే. టెస్లా, Nvidia, మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్ షేర్లు భారీగా నష్టపోయాయి. 1.9 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. ఈ ఏడాది అమెరికాలో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు 40%కి పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.