News March 20, 2025

మేం ఆదేశిస్తే పోలీసులు కేటీఆర్‌ను వంగబెట్టి దంచరా?: సీఎం రేవంత్

image

TG: తనకు పరిపాలనపై పట్టు రాలేదని BRS చేస్తున్న విమర్శలపై CM రేవంత్ మండిపడ్డారు. ‘వ్యవస్థ అంతా గత ప్రభుత్వం నాటిదే ఉంది కదా. ఆనాడు కోదండరామ్ తలుపులు బద్దలుకొట్టిన అదే పోలీసులు ఈరోజు నేను ఆదేశిస్తే KTR తలుపులు పగులకొట్టి వంగబెట్టి దంచరా? కానీ నేను అలాంటి విధానానికి వ్యతిరేకం. సచివాలయానికే రాని మీకు పట్టు ఉందా? రోజుకు 18 గంటలపాటు పనిచేస్తున్న నాకు, మా సీతక్కకు పరిపాలనపై పట్టు లేదా?’ అని ప్రశ్నించారు.

Similar News

News November 24, 2025

ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై సీఎం సమీక్ష

image

APలో కొత్తగా ఏర్పాటుచేయనున్న ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’పై CM చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ డేటా ద్వారా సంక్షేమ పథకాలు, పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఈ సిస్టమ్ పనిచేయనుంది. దీనివల్ల అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలు ఉంటుంది. కాగా కాసేపట్లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లలో మార్పులపై మంత్రివర్గ ఉపసంఘంతో CM సమావేశం కానున్నారు.

News November 24, 2025

శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

image

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>

News November 24, 2025

IIT ధన్‌బాద్ 105 పోస్టులకు నోటిఫికేషన్

image

<>IIT<<>> ధన్‌బాద్ 105 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎస్సీలకు 32, ఎస్టీలకు 20, ఓబీసీలకు 53 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ /డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iitism.ac.in