News March 23, 2025
ఇలాగే ఆడితే ఈసారి కప్ మాదే: పాటీదార్

IPL 2025 సీజన్లో RCBకి తొలి గెలుపు అందించిన కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడారు. ‘టోర్నీలో ఇలాగే గెలుచుకుంటూ పోతే టైటిల్ మాదే. కెప్టెన్గా తొలి మ్యాచ్ కావడంతో కొంత ఒత్తిడికి గురయ్యా. కోహ్లీలాంటి ఆటగాడు జట్టులో ఉండటం అదృష్టం. అతడు క్రీజులో ఉంటే కెప్టెన్ పని సులువవుతుంది. విరాట్ నుంచి నేర్చుకునేందుకు ఇది నాకు ఓ గొప్ప అవకాశం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా KKRతో మ్యాచులో పాటీదార్ 34 పరుగులు చేశారు.
Similar News
News November 15, 2025
బిహార్ రిజల్ట్స్: ఎన్డీఏ డబుల్.. కాంగ్రెస్ ఢమాల్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమిని తెచ్చిపెట్టాయి. ఎన్డీఏ డబుల్ సెంచరీ కొట్టగా కాంగ్రెస్ మాత్రం 6 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికల్లో INCకి 19 సీట్లు రాగా ఈ సారి అందులో మూడో వంతే రావడం గమనార్హం. డబుల్ ఇంజిన్ సర్కారుకే మొగ్గు చూపిన ఓటర్లు రాహుల్ ప్రచారాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. ఇక బీజేపీకి 89 సీట్లు రాగా జనతా దళ్కు ఏకంగా 85 వచ్చాయి.
News November 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 15, 2025
శుభ సమయం (15-11-2025) శనివారం

✒ తిథి: బహుళ ఏకాదశి తె.4.06 వరకు
✒ నక్షత్రం: ఉత్తర రా.1.52 వరకు
✒ శుభ సమయాలు: ఉ.9.00-10.00, సా.5.20-6.10
✒ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు
✒ యమగండం: మ.1.30-3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36 వరకు
✒ వర్జ్యం: ఉ.8.20-9.59 వరకు
✒ అమృత ఘడియలు: రా.7.09-8.49 వరకు


