News October 11, 2024
మేం చదువు చెబితే కేసీఆర్ గొర్రెలు, బర్రెలు ఇచ్చారు: రేవంత్

TG: తాము 90 రోజుల్లోనే 30వేల మందికి ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పిల్లలకు విద్య, పేదలకు వైద్యం ఇవ్వడం తమ విధానం అయితే.. చేపలు, గొర్రెలు, బర్రెలు ఇవ్వడం కేసీఆర్ విధానం అని ఫైరయ్యారు. కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటూ వేర్వేరుగా స్కూళ్లు పెట్టారని, కానీ తమ ప్రభుత్వం అన్ని కులాల పిల్లలు ఒకే దగ్గర చదువుకునేలా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల

TG: రాష్ట్రంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రుణమాఫీ కోసం రూ.33 కోట్లు నిధులు రిలీజ్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత కార్మికుల అప్పులు తీర్చేందుకు వీటిని వినియోగించనున్నారు. నిధుల విడుదలపై చేనేత కార్మికులు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
News November 20, 2025
ఏపీకి మళ్లీ వర్ష సూచన

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని.. తర్వాతి 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి వాయుగుండంగా బలపడే ఛాన్సుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేటి నుంచి ఆదివారం వరకు ప్రకాశం, NLR, CTR, TPT, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
News November 20, 2025
ఓటమి తర్వాత తేజస్వీ యాదవ్ ఫస్ట్ రియాక్షన్

కొత్త ప్రభుత్వం బిహార్ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు RJD నేత తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి తర్వాత తొలిసారి ఆయన స్పందించారు. ‘సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ గారికి, కొత్తగా మంత్రులైన సభ్యులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.


