News October 23, 2025
మగాడివైతే మాతో పోరాడు.. ఆసిమ్ మునీర్‌కు పాక్ తాలిబన్ల సవాల్

పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) సవాల్ విసిరింది. తమపైకి సైనికులను పంపడం మానుకుని, ఉన్నతాధికారులే యుద్ధానికి రావాలంటూ వీడియోను రిలీజ్ చేసింది. ‘నువ్వు మగాడివైతే మాతో పోరాడు. తల్లిపాలు తాగుంటే మాతో యుద్ధం చెయ్’ అని ఆసిమ్ మునీర్‌కు TTP కమాండర్ కజీం ఛాలెంజ్ విసిరాడు. కాగా కజీం సమాచారం ఇచ్చిన వారికి రూ.10 కోట్ల రివార్డును పాక్ అధికారులు ప్రకటించారు.
Similar News
News October 23, 2025
₹6500 కోట్లతో పల్లె పండుగ 2.0

AP: గ్రామాల రూపురేఖలు మార్చేలా పల్లె పండుగ-2.0కు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దీనికోసం ₹6500 కోట్లతో 52వేల పనులు చేపట్టి సంక్రాంతికి పూర్తి చేసేలా ప్లాన్ రూపొందిస్తోంది. ఈనెలాఖరు లేదా నవంబర్ తొలివారంలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. గతేడాది ఇదే ప్రోగ్రాం కింద ₹4500 కోట్లు ఖర్చు చేశారు. ఈసారి కూడా గతంలో మాదిరి రోడ్లు, కాలువలు, గోకులాలతో పాటు 1107 పంచాయతీల్లో మ్యాజిక్ డ్రెయిన్ ఇతర పనులు చేపట్టనున్నారు.
News October 23, 2025
వేధింపులను ధైర్యంగా ఎదుర్కోండి

చాలామంది మహిళలు భర్త, అత్తవారింటి నుంచి వేధింపులు ఎదురైనపుడు కుటుంబ పరువు గురించి ఆలోచించి వాటిని భరిస్తూ కుంగిపోతున్నారు. కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. మహిళలను వెంబడించినా, దూషించినా, అడ్డుకున్నా, వేధింపులకు గురి చేసినా.. ఐపీసీ పలు సెక్షన్ల కింద శిక్షార్హులని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి వాటిపై మహిళలు అవగాహన పెంచుకోవాలని, అందుబాటులో ఉన్న సౌకర్యాలు వాడుకోవాలని సూచిస్తున్నారు.
News October 23, 2025
APPLY NOW: IRCTCలో 64 ఉద్యోగాలు

IRCTCలో 64 హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజంలో బీఎస్సీ/బీబీఏ/ఎంబీఏ పూర్తిచేసిన 28 ఏళ్లలోపు వారు అర్హులు. రెండేళ్ల అనుభవం ఉండాలి. నవంబర్ 8-18 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.irctc.com/
✒ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.