News June 7, 2024
స్మార్ట్ ఫోన్ వాడుతుంటే.. ఈ పొరపాట్లు వద్దు!

* స్మార్ట్ ఫోన్‌ను 4-5 రోజులకు ఒకసారైనా రీస్టార్ట్ చేయాలి.
* OSతో పాటు అన్ని యాప్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి.
* అపరిచిత Wi-Fi నెట్‌వర్క్‌లను కనెక్ట్ చేసుకోవద్దు.
* అవసరం లేనప్పుడు బ్లూటూత్‌ను ఆఫ్‌లో ఉంచాలి.
* సోషల్ మీడియాలోని లింకులతో యాప్స్ డౌన్లోడ్ వద్దు.
* టెలిగ్రామ్‌లో వీడియోల కోసం సజెస్ట్ చేసే యాప్స్ డౌన్లోడ్ చేయవద్దు
* అనుమానాస్పద టెలిగ్రామ్ ఛానళ్లలో జాయిన్ కావొద్దు.
Similar News
News December 22, 2025
యూరియా బుకింగ్ ఇక యాప్‌తో మాత్రమే

TG: యూరియా పొందాలంటే రైతులు నేటి నుంచి Fertilizer Booking Appతో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఈనెల 20 నుంచి కొన్ని జిల్లాల్లో ఈ విధానం అందుబాటులోకి రాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఇదే విధానం అమలుకానుంది. పారదర్శకంగా, నిజమైన లబ్ధిదారులకే యూరియా పంపిణీకి ఈ విధానం తెచ్చామని ప్రభుత్వం తెలిపింది. యాప్ ద్వారా యూరియా ఎలా బుక్ చేసుకోవాలి?, ఏ పంటకు ఎన్ని బస్తాలు ఇస్తారో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 22, 2025
ఆసుపత్రి వార్డుల్లో ఆహారం తినడంపై నిషేధం

TG: ఎలుకలు, కీటకాల సమస్య నివారణకు ఆసుపత్రి వార్డుల్లో రోగుల సహాయకులు భోజనం చేయడంపై వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా నిషేధం విధించింది. క్యాంటీన్లలోనే ఆహారం తినేందుకు అనుమతి ఇచ్చింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరింది. వార్డులో ఆహారం తిని పారవేయడంతో ఎలుకల బెడద పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
News December 22, 2025
ఇతిహాసాలు క్విజ్ – 104

ఈరోజు ప్రశ్న: పురాణాల ప్రకారం ఓ నెల పురుషుడిగా, మరో నెల స్త్రీగా మారుతూ.. రెండు వంశాలకు ప్రతినిధిగా నిలిచిన వ్యక్తి ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


