News October 14, 2025
మట్టి దీపాలు కొంటే.. ‘పేదింట్లోనూ దీపావళి’

దీపావళి సమీపిస్తున్న సందర్భంగా ప్రజలందరూ ఖరీదైన, కృత్రిమ డెకరేషన్ లైట్లకు బదులుగా సంప్రదాయ మట్టి దీపాలు వెలిగించాలని నెటిజన్లు కోరుతున్నారు. మట్టి దీపాలు, ఇతర అలంకరణ వస్తువులను చిరు వ్యాపారులు లేదా స్థానిక తయారీదారుల వద్ద కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల వారిని ఆర్థికంగా ఆదుకున్నట్లు అవుతుందంటున్నారు. ఈ పండుగ వేళ వారికి వెలుగునిచ్చి, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపవచ్చని చెబుతున్నారు.
Similar News
News October 14, 2025
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు సర్కార్.. గురు/శుక్రవారం విచారణ!

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. రిజర్వేషన్ల GOను కొట్టివేస్తూ హైకోర్టు ఇటీవల ఆదేశాలివ్వగా, దానిపై SLPని దాఖలు చేసింది. ఈమేరకు ప్రభుత్వ న్యాయవాది సుప్రీం రిజిస్ట్రార్ దగ్గర మెన్షన్ చేశారు. CJI అనుమతితో లిస్ట్ చేస్తామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. గురువారం లేదా శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
News October 14, 2025
ఆహార కల్తీని అడ్డుకోలేరా?.. FSSAIపై విమర్శలు

ఇండియాలో అత్యంత అవినీతి & పనికిరాని సంస్థ FSSAI అని నెటిజన్లు ఫైరవుతున్నారు. మార్కెట్‌లో కల్తీ ఆహారం, నాణ్యత లేని ప్యాకేజ్డ్ ఫుడ్‌లు యథేచ్ఛగా అమ్ముడవుతున్నా ఈ సంస్థ పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. సమస్య వచ్చిన తర్వాతే స్పందిస్తోందని మండిపడుతున్నారు. ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణమైన కల్తీ ఆహారాన్ని నియంత్రించడానికి క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News October 14, 2025
చిన్నారుల ప్రాణం ఖరీదు 10% కమీషన్!

MPలో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ తాగి 23 మంది చిన్నారులు చనిపోవడం తెలిసిందే. వీరికి ఆ దగ్గు మందు ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ ప్రవీణ్ సోనీ సంపాదించింది ఎంతో తెలుసా? ఒక్కో బాటిల్ ధర రూ.24.54 కాగా Sresan కంపెనీ నుంచి అతడికి వచ్చేది 10% కమీషన్(రూ.2.54). ప్రభుత్వ డాక్టర్ అయినప్పటికీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేవాడు. ప్రమాదకరమని తెలిసినా సోనీ రిపీటెడ్‌గా కోల్డ్రిఫ్ ప్రిస్క్రైబ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.