News October 26, 2024

త్వరలోనే లష్కర్లు, హెల్పర్ల నియామకం: ప్రభుత్వం

image

TG:ప్రధాన కాలువలు, డ్యామ్‌లు/రిజర్వాయర్ల పర్యవేక్షణ, గేట్ల ఆపరేషన్ కోసం 1597 మంది లష్కర్లు, 281 మంది హెల్పర్లను ప్రభుత్వం త్వరలో నియమించుకోనుంది. చదవడం, రాయడం వస్తే ఉంటున్న గ్రామంలోనే ఔట్‌సోర్సింగ్ జాబ్ చేయవచ్చు. జీతం ₹15,600. విద్యార్హతతో సంబంధం లేకుండా 45 ఏళ్లలోపు, ఫిట్‌గా ఉన్న వారిని తీసుకుంటారు. ప్రాజెక్టులు, చెరువుల నుంచి నీరు పొలానికి చేరుతుందా? గండ్లు పడ్డాయా? అనే వివరాలు వీరు సేకరిస్తారు.

Similar News

News December 17, 2025

ఎంపీలందరూ సభలో ఉండాలని కాంగ్రెస్ విప్.. జర్మనీలో రాహుల్!

image

MGNREGA పేరు మార్చే బిల్లు ఒకటీరెండు రోజుల్లో పార్లమెంటు ముందుకు రానుంది. ఈ క్రమంలో రానున్న 3 రోజులు హాజరుకావాలని పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. కానీ ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మాత్రం ప్రస్తుతం జర్మనీలో ఉండటం గమనార్హం. దీంతో రాహుల్ విషయంలో LoP అంటే లీడర్ ఆఫ్ పర్యటన్ అని బీజేపీ సెటైర్లు వేసింది. ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అని, శాశ్వతంగా వెకేషన్ మోడ్‌లో ఉంటారని విమర్శించింది.

News December 16, 2025

Photos: వనతారలో మెస్సీ పూజలు

image

‘గోట్ టూర్’లో భాగంగా ఇండియాలో పర్యటిస్తున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇవాళ గుజరాత్‌కు వెళ్లారు. అంబానీ ఫ్యామిలీకి చెందిన వనతారను సందర్శించారు. తన తోటి ప్లేయర్లు సురెజ్, రోడ్రిగోతో కలిసి అక్కడి ఆలయంలో పూజలు చేశారు. నుదుటిన బొట్టుతో, హారతి ఇస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారితోపాటు అనంత్ అంబానీ, రాధిక దంపతులు ఉన్నారు.

News December 16, 2025

మోదీ గొప్ప స్నేహితుడు: ట్రంప్

image

భారత్‌తో పాటు ప్రధాని మోదీపై US అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఇండియా ఒకటి. ఇది అద్భుత దేశం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి. మనకు PM మోదీ అనే గొప్ప స్నేహితుడు ఉన్నారు’ అని చెప్పారు. ఈ విషయాన్ని ఇండియాలోని US ఎంబసీ ట్వీట్ చేసింది. ద్వైపాక్షిక ట్రేడ్ డీల్ కోసం అమెరికా బృందం ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.