News April 11, 2024

మీకు చేతకాకుంటే చెప్పండి.. మేము చూసుకుంటాం: రాజ్‌నాథ్

image

పాకిస్థాన్‌ను ఉద్దేశించి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడం పాక్‌కు చేతకాకపోతే ఆ బాధ్యతలు అందుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఉగ్రవాదంతో భారత్‌లో అస్థిరత నెలకొల్పాలని కుట్ర చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఉగ్రవాదులు పాక్‌లో తలదాచుకున్నా వెంటాడి చంపుతామన్న రాజ్‌నాథ్ ఇప్పుడు మరోసారి తన దూకుడును ప్రదర్శించారు.

Similar News

News November 15, 2024

‘కంగువా’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

image

సూర్య నటించిన ‘కంగువా’ వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.58.62 కోట్లు(గ్రాస్) రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. రేపు, ఎల్లుండి వీకెండ్స్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇక నిన్న విడుదలైన ఈ మూవీ సినీ అభిమానుల నుంచి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. శివ దర్శకత్వం వహించిన కంగువాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలకపాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

News November 15, 2024

ఆ సంస్థలతో మళ్లీ చర్చలు: నారాయణ

image

AP: అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని సబ్ కమిటీ చర్చలు జరిపింది. గతంలో ఏయే సంస్థలకు ఎంతెంత భూములు కేటాయించారనే దానిపై స్టడీ చేయడంతో పాటు ఆయా సంస్థలతో చర్చలు జరపాలని CRDA అధికారులను ఆదేశించింది. ‘గత ప్రభుత్వం 3 ముక్కలాటతో భూములు పొందిన సంస్థలు నిర్మాణాలకు ముందుకు రాలేదు. మా ప్రభుత్వం వచ్చాక నిర్మాణాలు ప్రారంభిస్తామని ఆ సంస్థలు ముందుకొస్తున్నాయి’ అని నారాయణ చెప్పారు.

News November 15, 2024

కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్

image

సౌతాఫ్రికాతో చివరిదైన నాలుగో టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. 2-1తో ముందంజలో ఉన్న IND ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది.
IND: శాంసన్, అభిషేక్, సూర్య, తిలక్, హార్దిక్, అక్షర్, రమన్‌దీప్, రింకూ సింగ్, బిష్ణోయ్, వరుణ్, అర్ష్‌దీప్
SA: రికెల్టన్, హెండ్రిక్స్, మార్క్రమ్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, సిమెలనే, కోయెట్జీ, మహారాజ్, సిపమ్లా