News April 4, 2024

కండువా మారిస్తే అంతా క్లీన్! – 1/2

image

BJPలోకి ఫిరాయించిన నేతలకు సంబంధించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. IE వివరాల ప్రకారం.. 2014 నుంచి ఇప్పటివరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 25 మంది బడా పొలిటీషియన్లు BJPలో చేరారు. వీరిలో 10 మంది కాంగ్రెస్ నుంచి.. NCP, శివసేన నుంచి చెరో నలుగురు ఉన్నారు. TMC నుంచి ముగ్గురు, TDP నుంచి ఇద్దరు.. సమాజ్‌వాదీ పార్టీ, YCP నుంచి చెరొకరు బీజేపీలో చేరారు.
<<-se>>#Elections2024<<>>

Similar News

News December 16, 2025

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ప్రారంభ సమయంలో Sensex సుమారు 300 పాయింట్లు పడిపోయి 84,900 స్థాయికి దిగివచ్చింది. Nifty కూడా 100 పాయింట్లకు పైగా నష్టపోయి 25,950 కంటే దిగువకు చేరింది. బ్యాంకింగ్‌, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సోమవారం కూడా మార్కెట్లు నష్టాల్లోనే కూరుకుపోగా.. ఈరోజూ అదే ధోరణి కొనసాగుతోంది. ట్రేడింగ్ కొనసాగుతున్న కొద్దీ మార్కెట్ దిశపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

News December 16, 2025

ప్రసారభారతిలో ఉద్యోగాలు

image

ప్రసార భారతి, న్యూఢిల్లీలో 16 కాస్ట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. CMA ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు రేపటి వరకు అప్లై చేసుకోవచ్చు. టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కాస్ట్ ట్రైనీలకు ప్రతి నెల స్టైపెండ్ చెల్లిస్తారు. మొదటి సంవత్సరం రూ.15,000, రెండో సంవత్సరం రూ.18,000, మూడో సంవత్సరం రూ.20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in

News December 16, 2025

సిరీస్ మధ్యలో బుమ్రా ఎందుకు ముంబై వెళ్లారు?

image

IND vs SA T20 సిరీస్ మధ్యలో జస్ప్రీత్ బుమ్రా జట్టు నుంచి తప్పుకోవడం వెనుక వ్యక్తిగత కారణాలున్నట్లు BCCI వెల్లడించింది. అత్యంత సన్నిహిత వ్యక్తి హాస్పిటల్‌లో చేరడంతో వెంటనే ముంబైకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపింది. మూడో T20 టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పరిస్థితి మెరుగుపడితే 4 లేదా 5వ మ్యాచ్‌కు బుమ్రా తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని BCCI అధికారి తెలిపారు.