News June 17, 2024
ఆ లింక్ క్లిక్ చేస్తే మీ వాట్సాప్ హ్యాక్

‘పీఎం కిసాన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్’ అంటూ వాట్సాప్ గ్రూప్‌ల్లో ఓ APK ఫైల్ చక్కర్లు కొడుతోంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో ఈ లింక్ క్లిక్ చేసిన 10 మంది వాట్సాప్ హ్యాక్ అయింది. వారి అకౌంట్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లాయి. PM కిసాన్ యాప్ లింక్‌ను క్లిక్, ఫార్వార్డ్ చేయొద్దని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా బాధితులు ఉంటే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని చెప్పారు.
Similar News
News December 18, 2025
శనగ పంటలో జింకు లోపం నివారణ

ఉదజని సూచిక ఎక్కువగా ఉన్న నేలలు, వరి తర్వాత శనగ సాగు చేసే నేలల్లో జింకు లోపం కనిపిస్తుంది. మొక్క వేరు వ్యవస్థ దృఢంగా ఉండేందుకు, బొడిపెలు బాగా కట్టేందుకు, బొడిపెలలో నత్రజని ఎక్కువగా ఉండేందుకు జింకు అవసరం. జింకు లోపం వల్ల మొక్క మధ్య, దిగువ భాగంలో ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి జింక్ సల్ఫేట్ 2 గ్రాములను కలిపి పిచికారీ చేస్తే మొక్కలు తొందరగా కోలుకుంటాయి.
News December 18, 2025
మీ ఊరిలో ఎవరు గెలిచారు?.. ఎక్కడ చూసినా ఇదే చర్చ!

TG: పంచాయతీ ఎన్నికల తుది పోలింగ్ ముగియడంతో ఎక్కడ చూసినా కొత్త సర్పంచ్ల గురించే చర్చ. ప్రలోభాలను చూసి ఓటేశారా? అభివృద్ధి చేస్తారని నమ్మారా? అని ఒకరిని ఒకరు ఆరా తీస్తున్నారు. భారీగా డబ్బు పంచి గెలిచారని చాలచోట్ల జనం మాట్లాడుకుంటున్నారు. కుల సమీకరణాలు, నోట్ల కట్టల ప్రభావం గెలుపోటములను శాసించాయనే ఆరోపణలు వస్తున్నాయి. మీ ఊరి కొత్త సర్పంచ్ ఎవరు? ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచారో కామెంట్ చేయండి.
News December 18, 2025
సౌత్‌లో పొల్యూషన్ లేదు.. అక్కడ మ్యాచ్‌లు ఆడొచ్చు: శశిథరూర్

తీవ్ర పొగమంచు కారణంగా ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దక్షిణాదిలో మ్యాచ్‌లు ఆడొచ్చు. ఎందుకంటే అక్కడ కాలుష్యం, విజిబిలిటీ సమస్య లేదు. అభిమానులు కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఉత్తర భారతంలో మ్యాచ్‌లను ఎందుకు షెడ్యూల్ చేయాలి? బదులుగా సౌత్‌లో నిర్వహించాలి’ అని సూచించారు.


