News November 20, 2024
నేరాలు చేస్తే తాట తీస్తాం: చంద్రబాబు

AP: కరడుగట్టిన నేరస్థులకు రాష్ట్రంలో చోటు లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే తాట తీస్తామని ఆయన హెచ్చరించారు. ‘గత ప్రభుత్వ హయాంలో నేరాలు, ఘోరాలు ఎక్కువయ్యాయి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఎక్కువగా గంజాయి, డ్రగ్స్ కారణంగానే నేరాలు జరుగుతున్నాయి. అందుకే వాటిపై మా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇకపై ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో అదే చేస్తాం’ అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Similar News
News January 28, 2026
విమాన ప్రమాదంపై నిష్పాక్షిక విచారణ జరగాలి: మమతా బెనర్జీ

మహారాష్ట్ర బారామతిలో విమానం కుప్పకూలిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరగాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ప్రమాదంపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే దర్యాప్తు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
News January 28, 2026
ఫ్లైట్ క్రాష్‌లలో చనిపోయిన ప్రముఖులు.. (1/2)

నేతాజీ 1945లో తైవాన్ విమాన ప్రమాదంలో అదృశ్యమవగా 1966లో అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా స్విట్జర్లాండ్ క్రాష్‌లో కన్నుమూశారు. 1973లో కేంద్ర గనుల మంత్రి మోహన్ కుమారమంగళం, 1980లో 34సం.ల సంజయ్ గాంధీ, 1994లో పంజాబ్ గవర్నర్ సురేంద్ర, 1997లో కేంద్ర రక్షణ సహాయ మంత్రి NVN సోము క్రాష్‌లలో మృతిచెందారు. 2001లో విమానయాన మంత్రి మాధవరావ్ సింథియా, 2002లో లోక్‌సభ స్పీకర్ బాలయోగి చాపర్ ప్రమాదాల్లో చనిపోయారు.
News January 28, 2026
ఫ్లైట్ క్రాష్‌లలో చనిపోయిన ప్రముఖులు.. (2/2)

2004లో BJP ఎన్నికల ప్రచారానికి వెళ్తూ బెంగళూరు హెలికాప్టర్ ప్రమాదంలో నటి సౌందర్య, 2005లో హరియాణా మంత్రి, వ్యాపారవేత్త ఓం ప్రకాశ్ జిందాల్ చనిపోయారు. 2009 SEPTలో ఉమ్మడి AP CM రాజశేఖర్ రెడ్డి నల్లమల పావురాలగుట్టపై హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఇక 2021లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ TNలో హెలికాప్టర్ క్రాష్‌లో, 2025లో ఎయిరిండియా ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని మృతిచెందారు.


