News January 9, 2025

సీఎంను విమర్శిస్తే కౌంటర్ ఇవ్వరా..? మంత్రులకు కేసీ క్లాస్

image

TG: PAC సమావేశంలో మంత్రులకు AICC ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. CMను ప్రతిపక్షాలు విమర్శిస్తే ఆయనే కౌంటర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, మంత్రులెందుకు స్పందించడంలేదని నిలదీశారని తెలుస్తోంది. తాను స్పందిస్తున్నానని ఓ మంత్రి చెప్పగా, ఎవరేం చేస్తున్నారో తనకంతా తెలుసని అన్నారు. కొందరు మంత్రులు పార్టీ లైన్ దాటి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహించినట్లు సమాచారం.

Similar News

News January 20, 2026

TG సీఐడీ సంచలన నిర్ణయం

image

తెలంగాణ సీఐడీ సంచలన నిర్ణయం తీసుకుంది. బాధితుల ఇంటి వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించింది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, శారీరక దాడులు, ఆస్తి వివాదాలు, పోక్సో చట్టం, SC/ST అట్రాసిటీ, ర్యాగింగ్ నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం కేసుల్లో స్టేషన్‌కు రాలేని బాధితులకు ఈ నిర్ణయంతో ఊరట దక్కనుంది. ఫోన్‌/మౌఖికంగా సమాచారం అందిస్తే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఫిర్యాదు స్వీకరిస్తారు.

News January 20, 2026

నన్ను అడగడం కాదు.. నేనే వాళ్లను ప్రశ్నలడిగా: హరీశ్ రావు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తనను ప్రశ్నలడగడం కాదని, తానే వాళ్లను చాలా ప్రశ్నలు అడిగానని మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్‌చాట్‌లో అన్నారు. ‘ఫోన్ ట్యాపింగ్‌తో నాకేంటి సంబంధం. నేను హోంమంత్రిగా చేయలేదు కదా. అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను అడగండి. సిట్టు, లట్టు, పొట్టుకు మేం భయపడం. నాకు సిట్ నోటీసు ఇవ్వడం కాదు. సీఎం రేవంత్‌కు ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి’ అని వ్యాఖ్యానించారు.

News January 20, 2026

ముగిసిన టెట్ ఎగ్జామ్స్.. ఈ నెల 30న ‘కీ’

image

TG: రాష్ట్రంలో ఈ నెల 3న ప్రారంభమైన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షలు నేటితో ముగిశాయి. పేపర్-1,2కు మొత్తం 2.38 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 82.09 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రస్తుతం టీచర్లుగా కొనసాగుతున్నవారు టెట్ రాయాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పుతో ఈసారి 71,670 మంది ఇన్ సర్వీస్ టీచర్లు అప్లై చేశారు. ఈ నెల 30న ‘కీ’, ఫిబ్రవరి 10-16 మధ్య ఫలితాలు వెలువడనున్నాయి.