News November 9, 2024

దమ్ముంటే.. రాహుల్ గాంధీతో సావర్కర్, బాల్‌ఠాక్రేను పొగిడించండి: మోదీ సవాల్

image

దమ్ముంటే రాహుల్ గాంధీతో హిందుత్వ నేతలు వీర సావర్కర్, బాల్‌ఠాక్రేను పొగిడించాలని ఇండియా కూటమి నేతలకు PM మోదీ సవాల్ విసిరారు. వారు దేశానికి చేసిన సేవలపై మాట్లాడించాలన్నారు. సావర్కర్ తమకు స్ఫూర్తి అని, మరాఠీ చరిత్ర, సంస్కృతిని విశ్వసిస్తామని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం ఎప్పుడూ గౌరవించదన్నారు. ఎన్నికల వేళ సావర్కర్‌ను విమర్శించొద్దని కాంగ్రెస్‌ యువరాజుకు MVA సీనియర్ ఒకరు సలహా ఇచ్చినట్టు వివరించారు.

Similar News

News December 15, 2025

మెస్సీ టూర్ గందరగోళం.. కలకత్తా హైకోర్టులో PIL

image

ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ టూర్ సందర్భంగా కోల్‌కతా స్టేడియంలో ఏర్పడిన గందరగోళంపై హైకోర్టులో PILలు దాఖలయ్యాయి. వీటిని స్వీకరించిన కోర్టు వచ్చేవారం విచారిస్తామని పేర్కొంది. LOP సువేందు అధికారి తదితరులు వీటిని దాఖలు చేశారు. నిష్పాక్షిక దర్యాప్తుకోసం CBI, ED, SFIOతో విచారించాలని కోరారు. కాగా మిస్‌మేనేజ్మెంటు, స్టేడియంలో విధ్వంసం ఘటనలపై CM మమత రాష్ట్ర ప్రభుత్వ కమిటీతో విచారణకు ఆదేశించడం తెలిసిందే.

News December 15, 2025

యూరియా బుకింగ్ కోసం యాప్: తుమ్మల

image

TG: యాసంగికి సరిపడా యూరియా అందుబాటులో ఉంచుతామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు బారులు తీరాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునేందుకు త్వరలో మొబైల్ యాప్ విడుదల చేస్తామన్నారు. కాగా ఇప్పటికే 2.48 లక్షల టన్నుల ఎరువులు రాష్ట్రంలో అందుబాటులో ఉండగా.. డిసెంబర్‌కు కేటాయించిన యూరియా కూడా చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News December 15, 2025

ఇంధన ధరల్లో తేడాకు అవే కారణం: కేంద్రం

image

ఢిల్లీ, ముంబైతో పోలిస్తే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి సురేశ్ గోపీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.74, అండమాన్&నికోబార్‌లో రూ.82.46గా ఉంది. రవాణా ఖర్చులు, ఆయా రాష్ట్ర/UT ప్రభుత్వాలు విధించే VAT (వాల్యూ యాడెడ్ ట్యాక్స్)లో తేడాలే ఇందుకు కారణం’ అని తెలిపారు. ఏపీలో లీటర్ పెట్రోల్ పై VAT రూ.21.90, అండమాన్‌లో రూ.0.82గా ఉంది.