News January 4, 2025
ముసలి తల్లిదండ్రుల్ని నిరాదరిస్తే ఆస్తిహక్కు రద్దు.. మీరేమంటారు?
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిరాదరించే కొడుకులు-కోడళ్లు, కూతుళ్లు-అల్లుళ్లకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టని నిపుణులు అంటున్నారు. వారిని నిర్లక్ష్యం చేసే పిల్లలకు ఆస్తిహక్కును రద్దుచేయడాన్ని స్వాగతిస్తున్నారు. అష్టకష్టాలు పడి పెంచితే, తినీతినక చదివిస్తే, రెక్కలొచ్చాక ప్రేమ సంగతేమో గానీ కనీసం జాలిలేకుండా ముసలి వాళ్లను నిరాదరించే విష సంస్కృతి ఈ మధ్య పెరిగింది. వాళ్ల తిక్కను ఈ తీర్పు కుదిరిస్తుందా?
Similar News
News January 6, 2025
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఎదుట విదేశీ వైద్య విద్యార్థుల ఆందోళన
AP: విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఆందోళనకు దిగారు. ఇంటర్న్‌షిప్ గడువు మూడేళ్లు కాకుండా ఏడాది మాత్రమే పెట్టాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల ఇంటర్న్‌షిప్ చేయాలని సర్క్యూలర్ జారీచేయడాన్ని వ్యతిరేకించారు. వర్సిటీ తమపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. వెంటనే అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు.
News January 6, 2025
పవన్.. నీకు మానవత్వం ఉందా?: రోజా
AP: గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరి అభిమానులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా పరామర్శించకపోవడం అమానవీయమని వైసీపీ నేత రోజా విమర్శించారు. ‘ రేవతి వ్యవహారంలో ‘పుష్ప 2’ టీమ్ బాధ్యతగా వ్యవహరించలేదని పవన్ అన్నారు. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్నదేమిటీ? పైగా వారి మరణానికి వైసీపీ రోడ్లు వేయకపోవడమే కారణమని పవన్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు’ అని ఆమె ఫైర్ అయ్యారు.
News January 6, 2025
క్రికెట్ లీగ్‌లో అడుగుపెట్టిన అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ నటుడు ETPL(యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్)లో అడుగుపెట్టారు. ఇటీవలే ఐసీసీ ఆమోదం పొందిన ETPL ఈ ఏడాది జులైలో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ ప్లేయర్లతో పాటు ప్రపంచస్థాయి క్రికెటర్లు కూడా ఆడతారు. ఈ లీగ్‌లో అభిషేక్ ఓ జట్టుకు కో ఓనర్‌గా వ్యవహరించనున్నారు. కాగా అభిషేక్ ఇప్పటికే PKLలో జైపూర్ పింక్ ఫ్యాంథర్స్ జట్టుకు ఓనర్‌గా ఉన్న విషయం తెలిసిందే.