News May 15, 2024
అలా చేస్తే ప్రజాజీవితానికి పనికిరాను: మోదీ
ఒకవేళ తాను హిందూ-ముస్లిం రాజకీయాలు చేస్తే ప్రజాజీవితంలో ప్రధానిగా పనికిరానని మోదీ అన్నారు. తాను హిందూ-ముస్లింలను విడదీసే రాజకీయం చేయబోనని న్యూస్18తో స్పష్టం చేశారు. ‘ముస్లింలు ఎక్కువ మందిని కంటారని నేను అనలేదు. ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని మాత్రమే అన్నాను. హిందువుల్లోనూ పేదలుంటారు. నా వ్యాఖ్యలను ముస్లింలకు మాత్రమే ఆపాదిస్తూ తప్పుడు ప్రచారం చేశారు’ అని మోదీ పేర్కొన్నారు.
Similar News
News January 11, 2025
గేమ్ ఛేంజర్ తొలిరోజు కలెక్షన్లు ఎన్నంటే?
రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ నిన్న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు ఈ మూవీ రూ.47.13 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు హిందూస్థాన్ టైమ్స్ పేర్కొంది. తెలుగులో రూ.38Cr, హిందీలో రూ.7Cr, తమిళ్‌లో రూ.2Cr వసూలు చేసినట్లు తెలిపింది. మార్నింగ్ షోల్లో 55.82%, మ్యాట్నీలో 39.33%, ఈవెనింగ్ షోల్లో 50.53% ఆక్యుపెన్సీ నమోదు చేసిందని వెల్లడించింది. మరి మీరూ మూవీ చూశారా? చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.
News January 11, 2025
నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
AP: మకర సంక్రమణ పుణ్యకాలం సందర్భంగా శ్రీశైలంలో నేటి నుంచి ఈ నెల 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఉ.8.45గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రేపటి నుంచి స్వామి, అమ్మవార్లకు వాహనసేవలు నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా నేటి నుంచి 17 వరకు ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, స్వామిఅమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవలు నిలిపివేశారు.
News January 11, 2025
ఆమెపై పరువునష్టం దావా: గరికపాటి టీమ్
ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై దుష్ప్రచారం చేసిన మహిళను చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధమైనట్లు ఆయన టీమ్ తెలిపింది. సరస్వతుల కామేశ్వరిపై పరువు నష్టం దావా వేయడంతో పాటు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు SMలో ప్రకటించింది. అలాగే దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లకూ లీగల్ నోటీసులు పంపించినట్లు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంది. అభిమానులు ఈ విషయంలో ఇకపై ఆందోళన చెందరాదని గరికపాటి టీం పేర్కొంది.