News July 15, 2024

అలా చేస్తే రుణమాఫీ వెనక్కి

image

TG: ఎవరైనా రైతులు/ఇతరులు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వం ప్రకటించిన రూ.2లక్షల పంట రుణమాఫీని పొందితే ఆ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఆ రైతు/ఇతరులు పొందిన మొత్తం డబ్బును వ్యవసాయశాఖ సంచాలకులు చట్టప్రకారం రికవరీ చేస్తారు. రుణ మాఫీకి అర్హులు కాని వారి విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.

Similar News

News December 6, 2025

శబరిమలలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి

image

శబరిమలలో శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ కూటికుప్పలపేటకు చెందిన గురుగుబెల్లి వరాహ నరసింహులు (72) మృతి చెందారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లగా శుక్రవారం గుండెపోటుతో మృతిచెందినట్లు తోటి భక్తులు మృతుని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువస్తున్నారు.

News December 6, 2025

ఇండిగో సంక్షోభం: CJI జోక్యం చేసుకోవాలని పిల్

image

ఇండిగో సంక్షోభంపై CJI జోక్యం చేసుకోవాలని కోరుతూ పిల్ దాఖలైంది. విమానయాన శాఖ, DGCA నుంచి స్టేటస్ రిపోర్టు తీసుకోవాలని, తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో అత్యవసర విచారణ కోసం పిటిషనర్ న్యాయవాదిని తన నివాసానికి పిలిపించి CJI మాట్లాడనున్నారని సమాచారం. మరోవైపు ఇండిగో సర్వీసులపై సమాచారం తెలుసుకుని రావాలని ప్రయాణికులను బెంగళూరు ఎయిర్‌పోర్టు కోరింది.

News December 6, 2025

NCCDలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్‌మెంట్‌లో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ(అగ్రి బిజినెస్), ఎంకామ్, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: nccd.gov.in.