News August 20, 2025

అలా చేస్తే ఊరుకునేది లేదు: బీఆర్ నాయుడు

image

AP: తిరుమలలో తప్పు చేస్తే మాట్లాడాలని, లేని పోని విమర్శలు సరికాదని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తప్పు చేయకుండా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు. తిరుమల వచ్చి తలనీలాలు సమర్పించి జగన్, భారతి ప్రసాదాలు తింటారా? ప్రతి చిన్న విషయాన్ని కావాలనే పెద్దది చేసి తిరుమలపై విమర్శలు చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి TTD ప్రతిష్ఠను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారు’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News August 21, 2025

అంగన్వాడీల్లో త్వరలో బ్రేక్ ఫాస్ట్: మంత్రి సీతక్క

image

TG: రాష్ట్రంలోని అంగన్వాడీల్లో పిల్లలకు త్వరలో అల్పాహారం పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఉదయం వేళ ప్రతి చిన్నారికీ 100ml పాలు సరఫరా చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు. అంగన్వాడీల్లోని వసతులపై అధికారులతో ఆమె సమీక్షించారు. వారంలో కనీసం ఒకరోజు ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ పెట్టాలని వారికి సూచించారు. HYDలో ప్రయోగాత్మకంగా బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేయగా 30% అటెండెన్స్ పెరిగిందన్నారు.

News August 21, 2025

రాత్రి కాఫీ తాగితే ఇంత ప్రమాదమా?

image

రాత్రులు కాఫీ తాగితే ఎంతో ప్రమాదమని టెక్సస్ యూనివర్సిటీ <>రీసెర్చర్స్ స్టడీ <<>>పేర్కొంది. వారి అధ్యయనం ప్రకారం రాత్రులు కాఫీ తాగితే నిద్ర పాడవడమే కాకుండా.. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఆవేశపూరిత, నిర్లక్ష్యపు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. డ్రోసోఫిలా మెలనోగ్యాస్టర్ అనే ఈగ జాతిపై పరిశోధనలు చేశారు. రాత్రులు కెఫిన్ ఇచ్చిన ఈగల ప్రవర్తన వింతగా, నిర్లక్ష్యంగా ఉందని తెలిపారు.

News August 21, 2025

ఏది ఏమైనా టిడ్కో ఇళ్లు కట్టిస్తాం: నారాయణ

image

AP: లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లో టిడ్కో ఇళ్లు అందజేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ‘గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల గందరగోళం అయ్యింది. పెండింగ్ బిల్స్ రూ.3,664 కోట్లు, కాంట్రిబ్యూషన్ రిటర్న్‌కి రూ.370కోట్లు, ఇళ్లు కట్టడానికి రూ.2,100 కోట్లు కావాలి. 83,072 ఇళ్లు రెడీగా ఉన్నాయి. సంక్రాంతికి మరో లక్ష ఇళ్లు, మిగిలినవి వచ్చే మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని CM ఆదేశించారు’ అని తెలిపారు.