News January 3, 2025

రాత్రి భోజనం తర్వాత ఇలా చేస్తే..

image

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి అలవాట్లను పాటించాలి. రాత్రి భోజనం ఆలస్యంగా చేసి ఆలస్యంగా నిద్ర పోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం అనంతరం ప్రొబయోటిక్ ఆహారం తీసుకోవాలి. పాలు, పెరుగు, మజ్జిగ, సోంపు వంటివి తినాలి. అనంతరం పావుగంట వాకింగ్ చేస్తే తిన్నది సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే భోజనం అనంతరం వజ్రాసనం వేయడం మంచిది. దీని వల్ల గ్యాస్ సమస్య ఉండదు. దీంతో బరువు కూడా పెరగకుండా ఉంటారు.

Similar News

News January 4, 2026

ఎంపీ వినతితో వికారాబాద్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేనా?

image

ధారుర్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్లో హుబ్లీ, బీజాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. కోవిడ్ సమయంలో ఈ స్టేషన్లో రైళ్ల నిలపడాన్ని ఆపేశారని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొ న్నారు. హుబ్లీ, బీజాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా చూడాలని కోరారు.

News January 4, 2026

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియాలో పోస్టులు

image

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (<>EdCIL<<>>) 15 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BBA, BA, BCom, B.Tech/BE, CA అర్హతగల వారు జనవరి 19 వరకు NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు స్టైపెండ్ రూ.15వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.edcilindia.co.in

News January 4, 2026

‘జెలెన్‌స్కీని పుతిన్ బంధిస్తే?’.. ట్రంప్‌పై రో ఖన్నా ఫైర్!

image

వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్‌ను భారత సంతతి US MP రో ఖన్నా తప్పుబట్టారు. ఇది ఒక అనవసర యుద్ధమని విమర్శించారు. ‘ఇలాంటి దాడుల వల్ల ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రేపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పుతిన్ బంధిస్తే? లేదా తైవాన్ నేతలపై చైనా దాడి చేస్తే అప్పుడు మనం ఏమనగలం?’ అని ప్రశ్నించారు. ఈ చర్య వల్ల అంతర్జాతీయ వేదికపై అమెరికా నైతిక బలాన్ని కోల్పోతుందని రో ఖన్నా అభిప్రాయపడ్డారు.