News September 28, 2024

భోజనం చేశాక ఇలా చేస్తే..

image

భోజనం చేశాక 10 నిమిషాలు నడిస్తే జీర్ణక్రియ మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. పేగుల్లో కదలికలు జరిగి ఆహారం త్వరగా జీర్ణమవుతుందని.. ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం లాంటి సమస్యలూ తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయులు తగ్గేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే తిన్న వెంటనే కాకుండా 5-10 నిమిషాల తర్వాత నడవాలని సూచిస్తున్నారు.

Similar News

News December 8, 2025

హీరోయిన్‌కు వేధింపులు.. మలయాళ నటుడిని నిర్దోషిగా తేల్చిన కోర్టు

image

హీరోయిన్‌పై లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ మేరకు కేరళలోని ఎర్నాకులం జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. వారికి శిక్షను ఈనెల 12న ప్రకటించనుంది. 2017లో సినీ నటిపై వేధింపుల కేసులో దిలీప్ అరెస్టయ్యారు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. దాదాపు 8 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది.

News December 8, 2025

ఇండిగో సంక్షోభం.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో

image

ఇండిగో విమానాల సంక్షోభంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే ఇది తీవ్రమైన సమస్య అని, లక్షలాది మంది బాధితులు ఉన్నారని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా విమానాల రద్దుపై ఈ పిల్ దాఖలైంది.

News December 8, 2025

రూ.7,887 కోట్లు అకౌంట్లలో జమ

image

TG: వరి సేకరణలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 41.6 లక్షల టన్నుల వరి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు 48 గంటల్లోనే రూ.7,887 కోట్లు చెల్లించామని తెలిపారు. వరి కొనుగోళ్లలో 45% ఐకేపీ మహిళల భాగస్వామ్యంతో మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.