News October 24, 2024

తిన్న తర్వాత ఇలా చేస్తే..

image

పడుకోవడానికి 3 గంటల ముందే భోజనం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే పడుకుంటే ఊబకాయం పెరుగుతుంది. ఆహారం సరిగా జీర్ణం కాదు. కాఫీ, టీ తాగితే కడుపులో గ్యాస్, జీర్ణసంబంధిత వ్యాధులకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. మసాలాలు, మాంసాహారం కాకుండా తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భోజనం చేశాక కచ్చితంగా కనీసం 100 అడుగులు వేయాలి.

Similar News

News November 24, 2025

రాయచోటి: చంటి బిడ్డతో ఉద్యోగి నిరసన

image

రాయచోటిలోని కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ JAC ధర్నా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలు 15 నెలలుగా పరిష్కారం కాలేదని JAC జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్ రాజు తెలిపారు. HR పాలసీ అమలు, మినిమం టైమ్ స్కేల్, రెగ్యులరైజేషన్, జీతాల పెంపు, మెడికల్ సదుపాయాలు, EPF అమలు.. ఇలా పలు డిమాండ్లు చేశారు. ఈ నిరసనలో ఓ మహిళా ఉద్యోగి చంటి బిడ్డతో నిరసనలో పాల్గొంది.

News November 24, 2025

ఇతిహాసాలు క్విజ్ – 76 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: రావణుడు సీతమ్మవారిని అపహరించినా, ఆమెను బలవంతంగా ముట్టుకోవడానికి ప్రయత్నించడు. ఎందుకు?
జవాబు: రావణుడు పూర్వం నలకూబరుని భార్య రంభను బలవంతం చేశాడు. అప్పుడు కోపగించిన నలకూబరుడు ‘ఇకపై ఏ స్త్రీనైనా ఆమె ఇష్టం లేకుండా తాకితే నీ తల వంద ముక్కలవుతుంది’ అని రావణుడిని శపించాడు. ఈ శాపం కారణంగానే రావణుడు సీతను ఆమెను ముట్టుకోవడానికి సాహసించలేదు. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 24, 2025

మహిళల కోసం ఎన్నో పథకాలు: రేవంత్

image

TG: ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతికేలా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని CM రేవంత్ కొడంగల్ సభలో తెలిపారు. ‘సన్నబియ్యం ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. సోలార్ ప్లాంట్స్ నిర్వహణ అప్పగించాం. శిల్పారామంలో ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశాం’ అని వివరించారు.