News October 7, 2025
నిద్రపోయే ముందు ఇలా చేస్తే.. లక్ష్మీ కటాక్షం

నిద్రపోయే ముందు మహిళలు ఇంట్లోని గదులన్నింటిలో కర్పూరం వెలిగిస్తే ఆ గృహంలోకి ఐశ్వర్య దేవత అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు. ‘కర్పూరం నవగ్రహాలలో శుక్రుడికి సంబంధించినది. నిద్రపోయే ముందు దీన్ని వెలిగిస్తే.. ఇంటి వాతావరణంలో సానుకూల శక్తి పెరిగి, శుక్రుని బలం వృద్ధి చెందుతుంది. ఫలితంగా.. ఆ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఈ పవిత్రమైన సాధనతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు’ అని అంటున్నారు.
Similar News
News October 8, 2025
ఇంద్రకీలాద్రి ఆలయానికి రూ.10.30కోట్ల ఆదాయం

AP: విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయానికి దసరా నవరాత్రుల సందర్భంగా వచ్చిన హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. 11 రోజుల్లో రూ.10.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత ఏడాది రూ.9.32 కోట్లు రాగా, ఈసారి రూ.కోటి పెరిగింది. అంతే కాకుండా 387 గ్రాముల బంగారం, 19 కేజీల 450 గ్రాముల వెండిని భక్తులు అమ్మవారికి హుండీ కానుకగా సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.
News October 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 8, 2025
శుభ సమయం (08-10-2025) బుధవారం

✒ తిథి: బహుళ పాడ్యమి ఉ.7.31 వరకు
✒ నక్షత్రం: అశ్విని రా.2.19 వరకు
✒ శుభ సమయం: ఉ.10.00-ఉ.10.30, సా.4.05-సా.5.05
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.7.30-ఉ.9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: రా.10.32-రా.12.02
✒ అమృత ఘడియలు: రా.7.33-రా.9.03