News February 12, 2025

రోజుకు 30 నిమిషాలు ఇలా చేస్తే..!

image

ప్రతిరోజూ 10వేల అడుగులు వేయడం వీలుకాని వారు కనీసం ఆపకుండా 30 నిమిషాలు నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. ‘అధిక బరువు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్, అకాల మరణం నుంచి తక్కువ ప్రమాదం ఉంటుంది’ అని తెలిపారు. అయితే, నెమ్మదిగా నడవొద్దని, కాలక్రమేణా వేగాన్ని పెంచాలని సూచిస్తున్నారు. ఇది శరీర జీవక్రియ, శ్వాసకోశ, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Similar News

News February 12, 2025

23న జనసేన శాసనసభా పక్ష భేటీ

image

AP: ఫిబ్రవరి 23న జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం జరిగే ఈ భేటీలో పాల్గొనాలని ఎంపీలు, MLAలు, MLCలను పార్టీ ఆదేశించింది. 24వ తేదీన బడ్జెట్ సమావేశాలు పాల్గొననున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

News February 12, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ బుల్లిరాజు తండ్రి పోలీస్ కంప్లైంట్

image

‘సంక్రాంతికి వస్తున్నాం’లో బుల్లి రాజు పాత్రతో బాలనటుడు రేవంత్ భీమాల అందర్నీ ఆకట్టుకున్నాడు. అతడి పేరిట కొన్ని ట్విటర్, ఇన్‌స్టా ఖాతాలు రాజకీయ విమర్శలు చేస్తుండటంతో అతడి తండ్రి శ్రీనివాసరావు పోలీసుల్ని ఆశ్రయించారు. ఆయా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు. రేవంత్ భీమాల అన్న పేరిట ఉన్న ఇన్‌స్టా మాత్రమే తమదని, రేవంత్‌ను వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు.

News February 12, 2025

భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

image

AP: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి చేసింది. భక్తులు వారికి నిర్దేశించిన సమయానికే క్యూలైన్లలోకి ప్రవేశించాలని సూచించింది. కొంతమంది భక్తులు కేటాయించిన సమయానికి ముందే క్యూలైన్ల వద్దకు వెళ్లి అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారని ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. సోషల్ మీడియాలో TTDపై వారంతా అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

error: Content is protected !!