News January 1, 2025
ఈరోజు నుంచి ఇలా చేస్తే బీపీ, షుగర్, హార్ట్ ఎటాక్ దరిచేరవు!
న్యూఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని వాగ్దానాలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రోజుకు 10వేల అడుగులు నడుస్తామని ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నారు. ఒక దగ్గర కూర్చోకుండా శరీరాన్ని కదిలించాలి. రోజూ నడవడం వల్ల అధిక బరువు, మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, డిప్రెషన్, క్యాన్సర్‌తో పాటు అకాల మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుందని తెలిపారు.
Similar News
News January 4, 2025
SBI నుంచి 2 కొత్త డిపాజిట్ స్కీమ్‌లు
SBI రెండు కొత్త డిపాజిట్ పథకాలను ప్రారంభించింది. హర్ ఘర్ లఖ్‌పతీ స్కీమ్‌లో రూ.లక్ష చొప్పున(రూ.లక్ష మల్టిపుల్స్) పోగేసుకోవచ్చని SBI తెలిపింది. ఈ ప్రీకాలిక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్ కనీస కాలవ్యవధి 12నెలలు కాగా, గరిష్ఠ వ్యవధి 120 నెలలు. అటు, 80ఏళ్ల పైబడిన వారి కోసం తీసుకొచ్చిన SBI ప్యాట్రన్స్ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ కంటే 10బేస్ పాయింట్లు అదనంగా చెల్లించనున్నట్లు వెల్లడించింది.
News January 4, 2025
ఆకలి తీర్చేందుకు ఫొటోలు, వీడియోలెందుకు?
ఆకలితో ఉన్న అనామకుల కడుపు నింపేందుకు ఎంతోమంది ఆహారాన్ని డొనేట్ చేస్తుంటారు. అయితే, ఇదంతా వీడియోలు, ఫొటోలు తీస్తుండటంతో కొందరు ఇబ్బందికి గురై ఫుడ్ తీసుకునేందుకు ముందుకురారు. అలాంటి ఇబ్బందులు లేకుండా జర్మనీలోని కొన్ని ప్రాంతాల్లో ఆహార పొట్లాలను వీధుల్లో తగిలిస్తుంటారు. అవసరం ఉన్నవారు వాటితో కడుపు నింపుకుంటారు. ఈ చిన్నపాటి చొరవతో ఎలాంటి హడావుడి లేకుండా ఎంతో మంది ఆకలి తీరుతోంది.
News January 4, 2025
శ్రీవారి భక్తులకు TTD ఛైర్మన్ విజ్ఞప్తి
AP: వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. జనవరి 10-19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని.. 10,11,12వ తేదీల్లోనే స్వామిని దర్శించుకోవాలని అనుకోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. టోకెన్లను తీసుకోవాలన్న ఆత్రుతలో తోసుకోవద్దని సూచించారు. VIPలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని, సామాన్య భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.