News February 5, 2025

ఇలా చేస్తే ₹14లక్షల వరకు Zero Income Tax

image

కొత్త పన్ను విధానంలో ఉన్న ఏకైక మినహాయింపు NPS. సెక్షన్ 80CCD ప్రకారం బేసిక్ శాలరీలో 14% వరకు లబ్ధి పొందొచ్చు. దీనికి ₹75K స్టాండర్డ్ డిడక్షన్ తోడైతే దాదాపుగా ₹14L వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. Ex. CTC ₹13.75L, బేసిక్ ₹7.16L (CTCలో 50%) అనుకుందాం. అందులో NPS ₹1.1L (బేసిక్‌లో 14%), SD ₹75K తీసేస్తే మిగిలేది ₹11.9L. ఇది Taxable Income ₹12.1L కన్నా తక్కువే.

Similar News

News November 9, 2025

24MP ఫ్రంట్ కెమెరాతో ఐఫోన్18?

image

ఐఫోన్18 సిరీస్‌ను 2026 సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు యాపిల్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. A20 ప్రాసెసర్‌తో HIAA (హోల్ ఇన్ యాక్టివ్ ఏరియా) టెక్నాలజీని పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఐఫోన్ 18, 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో డిస్‌ప్లే కింద 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చనుందని వార్తలొస్తున్నాయి. 2027లో విడుదలయ్యే 18e మోడల్‌లో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫిక్స్ చేసే చాన్స్ ఉంది.

News November 9, 2025

తెలంగాణకు మొండిచేయి.. కేంద్ర బృందం రానట్టేనా?

image

పంట నష్టంపై అంచనా వేసేందుకు APలో ఈ నెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. 8 మంది అధికారులు 6 జిల్లాల్లో పర్యటించనున్నారు. మరోవైపు ఆగస్టులో ₹10వేల కోట్లు, ఇటీవలి తుఫానుతో ₹5వేల కోట్లు నష్టపోయినట్లు TG ప్రభుత్వం కూడా కేంద్రానికి నివేదిక పంపింది. కానీ దీనిపై కేంద్రం స్పందించలేదు. కనీసం బృందాన్నీ పంపడం లేదు. దీంతో కేంద్రం మరోసారి తెలంగాణకు మొండిచేయి చూపుతోందని విమర్శలు వస్తున్నాయి.

News November 9, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

✦ ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటకు 35 గంటల్లో 53+ మిలియన్ వ్యూస్
✦ మహేశ్ బాబు-రాజమౌళి సినిమా నుంచి ఈనెల 11న ప్రియాంక చోప్రా లుక్ రివీల్ చేసే అవకాశం: సినీ వర్గాలు
✦ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న ‘దురంధర్’ సినిమా నుంచి మాధవన్ పోస్టర్ విడుదల.. బట్టతలతో గుర్తుపట్టలేని విధంగా లుక్
✦ సుధీర్ బాబు ‘జటాధర’ సినిమాకు 2 రోజుల్లో రూ.2.91కోట్ల కలెక్షన్స్