News February 4, 2025

ఇలా చేస్తే క్యాన్సర్ దరిచేరదు!

image

ఎప్పుడు, ఎలా క్యాన్సర్ సోకుతుందో చెప్పలేం. కానీ, కొన్ని జాగ్రత్తలు ఈ వ్యాధిని దరిచేరనివ్వవు. ఈక్రమంలో వైద్యులు పేర్కొన్న కొన్ని సలహాలు మీకోసం. ధూమపానం చేయొద్దు. హెల్తీ ఫుడ్ తినండి. హెపటైటిస్ బి& HPV నివారణకు టీకాలు వేసుకోవాలి. సన్ ప్రొటెక్షన్ ఉపయోగించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. మద్యం మానుకోండి. ప్రాసెస్డ్ మాంసం వద్దు. పండ్లు & కూరగాయలు తినండి, పుష్కలంగా నీరు తాగండి, గుడ్లు తినండి.

Similar News

News February 4, 2025

నేషన్ బిల్డర్స్ అయిన ట్యాక్స్ పేయర్స్ అంటే మోదీకి గౌరవం: నిర్మల

image

దేశ నిర్మాతలైన పన్ను చెల్లింపుదారులను గౌరవించాలన్న ప్రధాని నరేంద్రమోదీ యత్నమే బడ్జెట్లో కల్పించిన రిలీఫ్ అని FM నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వంపై విశ్వాసం చెక్కుచెదరకుండా ఉండేందుకు నాలుగేళ్లుగా వారితో నిరంతరం టచ్‌లో ఉన్నామని తెలిపారు. వారి అభిప్రాయాలను బట్టే చర్యలు తీసుకున్నామని వివరించారు. పాత పన్ను విధానం రద్దు చేయాలనుకోవడం లేదని, మినహాయింపులు కోరుకొనేవారు ఉపయోగించుకోవచ్చని సూచించారు.

News February 4, 2025

రతన్ టాటా యువ స్నేహితుడికి కీలక పదవి

image

దివంగత వ్యాపారవేత్త రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుకు టాటా కంపెనీలో కీలక పదవి దక్కింది. స్ట్రాటజీస్ ఇనిషియేటివ్స్ విభాగానికి హెడ్, GMగా నియమితులైనట్లు శంతను LinkedInలో పోస్ట్ చేశారు. తన తండ్రి టాటా మోటార్స్ ప్లాంట్‌లో పని చేసేటప్పుడు వైట్ షర్ట్, నేవీ కలర్ ఫ్యాంట్ ధరించేవారని పేర్కొన్నారు. ఆయన కోసం తాను కిటికీ దగ్గర కూర్చొని ఎదురు చూసేవాడినని చిన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.

News February 4, 2025

కుంభమేళా తొక్కిసలాట అంత పెద్దదేమీ కాదు: హేమామాలిని

image

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట అంత పెద్దదేమీ కాదని BJP MP హేమామాలిని అన్నారు. కానీ కొందరు దీనిని పెద్దదిగా చూస్తున్నారని మండిపడ్డారు. ‘మేమూ కుంభమేళాకు వెళ్లి సంగం ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించాం. తొక్కిసలాటలో భక్తులు మరణించడం బాధాకరం. ఈ ఒక్క ఘటన తప్ప కుంభమేళా అద్భుతంగా కొనసాగుతోంది’ అని పేర్కొన్నారు. కాగా UP సర్కార్ కుంభమేళా మృతుల సంఖ్యను దాచిపెడుతోందని మాజీ CM అఖిలేశ్ ఆరోపించారు.

error: Content is protected !!