News November 13, 2024
చలికాలంలో పెదాలు పగలొద్దంటే..

* పెదాలు పగలడానికి డీహైడ్రేషన్ ప్రధాన కారణం. చలికాలం చాలామంది సరిపడా నీరు తాగరు. దీనివల్ల పెదాలు పొడిబారి, పగులుతాయి.
* పెదాలు కాస్త డ్రై అవగానే వాటిని నాలుకతో తడుపుతారు. ఇది పెదాలు మరింత పగలడానికి కారణం. పెదాలపై ఉండే స్కిన్ను కొరికేయవద్దు.
* విటమిన్ బీ, ఫ్యాటీ యాసిడ్లు, మినరల్స్ కలిగిన ఆహారం తీసుకోండి.
* బయటికి వెళ్లేటప్పుడు కచ్చితంగా మంచి లిప్బామ్/పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకోండి.
Similar News
News November 25, 2025
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 68,615 మంది భక్తులు దర్శించుకోగా 27,722 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది.
News November 25, 2025
దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు.. వచ్చే నెల 3న ఏర్పాటు

TG: రాష్ట్రంలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కానున్నాయి. డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వీటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. గత నెలలో గ్రామాల్లో మహిళా సమాఖ్యల ద్వారా లక్షన్నర మంది దివ్యాంగ మహిళలు, పురుషులను సెర్ప్ గుర్తించింది. మహిళల అధ్యక్షతన ఒక్కో స్వయం సహాయక సంఘంలో 5 నుంచి 10 మంది వరకు సభ్యులు ఉండాలని నిర్దేశించింది.
News November 25, 2025
పీరియడ్స్ రావట్లేదా..? అయితే జాగ్రత్త

కొంతమందికి ప్రతినెలా పీరియడ్స్ రావు. దానికి వ్యాధులు, తీవ్ర ఒత్తిడి, అనారోగ్యం, బరువు హఠాత్తుగా పెరగడం లేదా తగ్గడం వంటివి కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఏ కారణంతో పీరియడ్స్ రావడం లేదో వైద్యులను సంప్రదించి తెలుసుకోవడం చాలా అవసరం. పీరియడ్స్ మీ ఆరోగ్య స్థితికి అద్దంపడతాయి. కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఏదో అంతర్లీన సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే తగిన వైద్యం తీసుకోవడం చాలా ముఖ్యం.


