News January 17, 2025

రాత్రి భోజనం చేయకపోతే…

image

బరువు తగ్గుతామని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. నైట్ భోజనం చేయకపోతే మధ్యరాత్రి ఆకలివేసి నిద్రకు భంగం కలుగుతుంది. ఎసిడిటీ, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. మరుసటి రోజంతా నీరసంగా ఉంటుంది. బద్దకం, చికాకు పెరుగుతుంది. ఉదయం లేవగానే బాగా ఆకలేసి ఎక్కువ తింటారు. ఇది బరువు పెరుగుదలకు కారణం అవుతుంది. అందుకే ప్రతిరోజూ రాత్రి తప్పకుండా భోజనం చేయాలి. అయితే రోస్టెడ్‌తో పాటు ఫాస్ట్‌ఫుడ్‌ వంటివి తినకూడదు.

Similar News

News January 30, 2026

కాని వేళకి కందులు గుగ్గిళ్లయినట్లు

image

సాధారణంగా ఆకలిగా ఉన్నప్పుడు లేదా ఏదైనా పండుగ సమయంలో గుగ్గిళ్లు దొరికితే చాలా సంతోషిస్తాం. కానీ, అసలు అవసరం లేని సమయంలో, కడుపు నిండుగా ఉన్నప్పుడో, ప్రాధాన్యత లేనప్పుడో అవి ఎన్ని దొరికినా ప్రయోజనం ఉండదు. అలాగే ఏదైనా సహాయం అత్యవసరంగా కావాల్సినప్పుడు అందకుండా, అంతా అయిపోయాక అందితే వ్యర్థమని, దాని వల్ల ఎలాంటి లాభం ఉండదని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

News January 30, 2026

భూమి బయట సముద్రం ఉంటుందా?

image

భూమ్మీద సముద్రాలుంటాయి. మరి హిరణ్యాక్షుడు భూమిని సంద్రంలో ఎలా దాచాడు? ఈ సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే పురాణాల ప్రకారం.. ఈ విశ్వంలో సగం వరకు ‘గర్భోదక జలాలు’ ఉంటాయి. ఇందులో అనంతమైన నీరు ఉంటుంది. హిరణ్యాక్షుడు భూమిని ఈ విశ్వ జలరాశి అడుగునే పడేశాడు. ఓ నీటి గిన్నెలో బంతి మునిగినట్లుగా, భూగోళం ఆ సంద్రంలో మునిగింది. అప్పుడు భగవంతుడు వరాహ రూపంలో ఆ జలాల లోపలికి వెళ్లి, భూమిని రక్షించాడు.

News January 30, 2026

భూమిని కాపాడేందుకు వరాహ రూపమే ఎందుకు? (1/2)

image

గ్రహాలన్నీ ఓ నియమ కక్ష్యలో తిరుగుతుంటాయి. అయితే హిరణ్యాక్షుడు భూకక్ష్యకు విఘాతం కలిగించడంతో అది విశ్వ గర్భోదక జలాల్లో మునిగిపోయింది. నీటి అడుగున ఉన్న భూమిని రక్షించి, తిరిగి అదే స్థానంలో నిలపడానికి జలచర సామర్థ్యం గల వరాహ రూపం అనువైనది. అందుకే విష్ణువు ఆ అవతారమెత్తాడు. తన కొమ్ముదంతంతో భూమిని ఉద్ధరించి, హిరణ్యాక్షుణ్ని సంహరించాడు. ఇది కేవలం లీల మాత్రమే కాదు. సృష్టి సమతుల్యతను కాపాడే దివ్య చర్య.