News August 31, 2025
ఏడేళ్లు కనిపించకపోతే చనిపోయినట్లే: హైకోర్టు

TG: 21 ఏళ్ల క్రితం అదృశ్యమైన భర్త ఉద్యోగం ఇవ్వాలని క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. చట్టప్రకారం ఏడేళ్లు ఎవరైనా కనిపించకుండాపోతే చనిపోయినట్లేనని, వారసత్వం కింద కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని ఇండియన్ బ్యాంకుకు సూచించింది. వారికి రావాల్సిన పదవీ తొలగింపు ప్రయోజనాలు చెల్లించాలని ఖమ్మంకు చెందిన వనపట్ల సుగుణ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ఈ ఆదేశాలిచ్చారు.
Similar News
News September 1, 2025
ఇక సోలోగా ఎవరెస్ట్ ఎక్కడం కుదరదు

పర్వతారోహణకు నేపాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకొచ్చాయి. ఎవరెస్ట్ లాంటి 8000 మీటర్ల కంటే ఎత్తైన పర్వతాలను ఎక్కాలంటే ఇద్దరు సభ్యుల టీమ్ వెంట కనీసం ఒక మౌంటేన్ గైడ్ తప్పనిసరి. ఒంటరిగా ఎక్కాలనుకునే ఔత్సాహికులకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. అటు సీజన్ల వారీగా మౌంటేన్ క్లైంబింగ్ ఫీజును ప్రభుత్వం భారీగా పెంచింది. MAR-MAY మధ్య ఎవరెస్ట్ ఎక్కాలంటే ఒక్కొక్కరు రూ.13.2 లక్షలు కట్టాల్సిందే.
News September 1, 2025
కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు

దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. 19 కేజీల సిలిండర్ ధరను రూ.51.50 తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ రేట్ రూ.1,580కి చేరింది. తగ్గించిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. అటు గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
News September 1, 2025
ఈనెల 7న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు చూడొచ్చా?

ఈనెల 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. కర్కాటక, కుంభ రాశుల వారు ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ‘ఒక వేళ గ్రహణాన్ని వీక్షిస్తే అకారణంగా గొడవలు, వ్యక్తిగత సమస్యలు, ఆందోళన తలెత్తుతాయి. ఈ రెండు రాశుల వారు గ్రహణం పూర్తయ్యాక చంద్రుడికి అభిషేకం చేయాలి. రాహు గ్రహానికి పూజలు చేయాలి. అలాగే పేదలకు ధన సహాయం చేస్తే మంచిది’ అని వారు అంటున్నారు.