News October 26, 2024
పుజారాను వద్దనుకుంటే జట్టులో వీరెందుకు?

NZతో టెస్ట్ సిరీస్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై నెట్టింట విమర్శలు వెలువెత్తాయి. హిట్ మ్యాన్, కింగ్, ప్రిన్స్‌గా పేరొందిన ఆటగాళ్లు కనీసం స్పిన్ ముందు నిలవలేదని కొందరు పోస్టులు చేశారు. పుజారా వంటి ప్లేయర్‌ను స్వదేశంలో జరిగే మ్యాచులకు ఎంపిక చేయనప్పుడు వీరిని ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ భారత జట్టు యువ ప్లేయర్ల కోసం చూస్తే రోహిత్, కోహ్లీ ఇంకా యంగ్ ప్లేయర్లేనా అని ప్రశ్నిస్తున్నారు.
Similar News
News December 14, 2025
వరి చేనులో జింకు లోపాన్ని ఎలా గుర్తించాలి?

వరి పంట పెరుగుదల, దిగుబడిలో జింకు సూక్ష్మపోషకం కీలక పాత్ర పోషిస్తుంది. వరి విత్తనం మొలకెత్తిన దశ నుంచి చివరి వరకూ జింకు అవసరం. ముఖ్యంగా చిరు పొట్ట దశలో జింకు అవసరం ఎక్కువగా ఉంటుంది. జింకు లోపం వచ్చిన వరి పొలాల్లో పిలకలు ఆలస్యంగా, తక్కువగా వస్తాయి. అంతేకాకుండా వచ్చిన వరి పిలకలు సరిగా పెరగవు. దీంతో పైరు ఎదగకుండా గిడసబారి కనిపిస్తుంది. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు ఎదుగుదలలో మార్పు కనిపించదు.
News December 14, 2025
KCRకి ఉన్న చరిష్మా వాళ్లెవరికీ లేదు: టీపీసీసీ చీఫ్

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని TPCC చీఫ్ మహేశ్ అన్నారు. ‘KCRకి ఉన్న చరిష్మా వాళ్ల కుటుంబంలో ఎవరికీ లేదు. పార్టీని నడపడం KTR వల్ల కాదు. BRSను హరీశ్ చీల్చుతాడు. ఆ పార్టీకి ఫ్యూచర్ ఉంటే కవిత ఎందుకు బయటకొస్తుంది. KTR డబ్బులు పెట్టి సోషల్ మీడియాతో నడిపిస్తున్నాడు’ అని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. CBN పెట్టుబడులు పెట్టాలని ఎంత ప్రచారం చేసినా ఇన్వెస్టర్లు HYD వైపే చూస్తున్నారని అన్నారు.
News December 14, 2025
15 రోజుల్లో ‘అవుకు’ లీకేజీలకు మరమ్మతు పూర్తి : జనార్దన్ రెడ్డి

AP: నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్‌ను మంత్రి జనార్దన్ రెడ్డి సందర్శించారు. ‘15 ఏళ్లుగా రిజర్వాయర్‌లో లీకేజీల సమస్య ఉంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. లీకేజీలు లేకుండా మరమ్మతు చేయిస్తున్నాం. ఇప్పటికే నిపుణులు వాటిని గుర్తించి కాంక్రీట్‌తో ఫిల్ చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు. ఇటీవల కట్ట కొద్దిగా కుంగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. 15 రోజుల్లో పనులు పూర్తవుతాయని, భయపడొద్దని సూచించారు.


