News February 4, 2025
చియా సీడ్స్‌ను నీటిలో వేసుకొని తాగితే..!

చియా సీడ్స్ ప్రకృతి మనకిచ్చిన వరం అని వైద్యులు చెబుతున్నారు. ‘సబ్జాలా చిన్నవిగా ఉన్నా అద్భుతమైన పోషకాలు కలిగి ఉంటాయి. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్స్, యాంటీ యాక్సిడెంట్స్ మెదడు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఫైబర్ పెద్ద పేగులోని ఆరోగ్యకరమైన బాక్టీరియాను మెరుగుపరిచి జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతాయి. మెగ్నీషియం ప్రశాంతంగా, సంతోషంగా ఉండేందుకు సహాయపడతాయి’ అని సూచించారు.
Similar News
News April 7, 2026
పవర్ ప్లాంట్ల చుట్టూ మానవ హారాలు.. యువతకు ఇరాన్ పిలుపు

‘హార్ముజ్’ను తెరవకపోతే ఇరాన్‌లోని బ్రిడ్జిలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇందుకు ఇచ్చిన గడువు కొన్ని గంటల్లో ముగియనుంది. ఈ క్రమంలో దేశంలోని పవర్ ప్లాంట్ల వద్ద మానవ హారాలుగా నిలబడాలని యువత సహా అని వర్గాల ప్రజలకు ఇరాన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. మౌలిక సదుపాయాలను రక్షించుకోవడమే లక్ష్యంగా ఈ ప్లాన్ వేసింది. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లపై దాడిని యుద్ధ నేరంగా అభివర్ణించింది.
News April 7, 2026
చికెన్‌లో ఈ పార్టులు తినొద్దు!

చికెన్ మంచి ప్రొటీన్ ఫుడ్. అయితే ఇందులోని కొన్ని పార్టులు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు మాత్రమే ఉండే స్కిన్, బాక్టీరియా ఆవాసంగా ఉండే మెడ, తల, లంగ్స్, గిజార్డ్(కందనకాయ), కాళ్లు, తోక భాగాలను తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు. వీటివల్ల జీర్ణసంబంధ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చికెన్ బ్రెస్ట్, లెగ్ పీస్, వింగ్స్ మంచివని పేర్కొంటున్నారు.
#ShareIt
News April 7, 2026
IPL: ఢిల్లీకి షాక్.. మరో 3 మ్యాచ్‌లకు స్టార్క్ దూరం!

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ మరో 3 మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఆయన భుజం, మోచేయి సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియా బోర్డు అనుమతిస్తే ఈ నెల 21న SRHతో మ్యాచ్ నాటికి అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపాయి. కాగా ఈ ఏడాది తొలి రెండు మ్యాచ్‌లను DC గెలిచిన విషయం తెలిసిందే.


