News August 19, 2024
రోజూ వేడి నీళ్లు తాగితే..

క్రమం తప్పకుండా హాట్ వాటర్ తాగితే నరాల పనితీరు పెరిగి రక్తప్రసరణ మెరుగవుతుంది. బాడీ ఫ్యాట్ కరుగుతుంది. చర్మం తేమగా, వెచ్చగా ఉంటుంది. ముఖంపై మొటిమలు ఏర్పడవు. దగ్గు, జలుబు, గొంతునొప్పి సమస్యలకు ఇదో మంచి హోం రెమెడీ. తేనె, నిమ్మరసం కలిపితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం సమస్య తీరుతుంది. బద్ధకం తగ్గి ఉల్లాసంగా ఉంటారు.
Similar News
News November 26, 2025
రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం: CM

AP: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు న్యాయం జరగాలని, సాంకేతిక ఇబ్బందులు ఉంటే తక్షణం పరిష్కరించాలని CRDA సమీక్షలో సూచించారు. మరోవైపు రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేయాలని, నిర్మాణాల నాణ్యత, వేగం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పేర్కొన్నారు.
News November 26, 2025
భట్టి కుమారుడి ఎంగేజ్మెంట్.. హాజరైన సీఎం

TG: హైదరాబాద్లో జరిగిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సతీమణి, కూతురు, అల్లుడితో కలిసి వచ్చిన సీఎం.. కాబోయే వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.
News November 26, 2025
RRR కేసు.. సునీల్ కుమార్కు సిట్ నోటీసులు

AP: రఘురామ కృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసులో IPS అధికారి, సీఐడీ మాజీ చీఫ్ PV సునీల్కుమార్కు సిట్ నోటీసులు జారీ చేసింది. DEC 4న జరిగే విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. 2021లో రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. కస్టడీలో చంపేందుకు ప్రయత్నించారని RRR 2024లో గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సునీల్ కుమార్తో పాటు మాజీ సీఎం జగన్, మరికొందరిని నిందితులుగా చేర్చారు.


