News December 10, 2024

చలికాలంలో ఈ జ్యూస్ తాగితే…

image

ఆరోగ్య పరిరక్షణలో ఉసిరిని మించింది లేదని ఆయుర్వేదం చెబుతోంది. పరగడపున దీని జ్యూస్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చలికాలంలో రెగ్యులర్‌గా తీసుకుంటే జబ్బు పడకుండా కాపాడుతుంది. మెటబాలిజాన్ని మెరుగుపరిచి బరువు తగ్గేందుకు సాయపడుతుంది. ఇందులోని విటమిన్-సి బోలెడంత ఇమ్యూనిటీని ఇస్తుంది. ఉదర సమస్యలు తొలగించి మలబద్ధకాన్ని తరిమేస్తుంది. కాలేయ, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రెస్‌నూ తొలగిస్తుంది.

Similar News

News November 16, 2025

మరో అల్పపీడనం.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు APSDMA తెలిపింది. ఈనెల 17, 18 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.

News November 16, 2025

ఆ ఐదేళ్లు రాష్ట్రానికి బ్యాడ్ పీరియడ్: చంద్రబాబు

image

AP: 2019-24 కాలం రాష్ట్రానికి బ్యాడ్ పీరియడ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ సమయంలో ఇండస్ట్రీలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. సోలార్ రంగం అభివృద్ధి చెందకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎకో సిస్టమ్ నిర్మించే పనిలో ఉన్నామని తెలిపారు. ఈ కారణంతోనే రాష్ట్రానికి గూగుల్ వచ్చిందని పేర్కొన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా పాలసీలు తయారు చేస్తున్నామని చెప్పారు.

News November 16, 2025

వారణాసి: ఒకేసారి ఇన్ని సర్‌ప్రైజులా?

image

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘<<18299698>>వారణాసి<<>>’ నుంచి వరుస అప్డేట్స్ వచ్చాయి. globe trotter ఈవెంట్‌లో మూవీ టైటిల్, మహేశ్ ఫస్ట్ లుక్‌, 3.40 నిమిషాల గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. 2027 సమ్మర్‌లో మూవీ విడుదల అని కీరవాణి తెలిపారు. రామాయ‌ణంలో ముఖ్య‌మైన <<18299599>>ఘ‌ట్టం <<>>తీస్తున్నాన‌ని, మహేశ్‌కు రాముడి వేషం వేశానని రాజమౌళి వెల్లడించారు. దీంతో ఒకేసారి ఇన్ని సర్‌ప్రైజులు ఇచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.