News January 21, 2025
ఈ నంబర్ల నుంచి కాల్ వస్తే..
ఫేక్ బ్యాంక్ కాల్స్ వల్ల మోసపోతున్న వారిని రక్షించేందుకు RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లకు లావాదేవీలు & మార్కెటింగ్ కాల్స్ చేయడానికి రెండు ప్రత్యేక ఫోన్ నంబర్ సిరీస్‌లను ప్రవేశపెట్టింది. నంబర్ ‘1600’తో ప్రారంభమైతే బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన కాల్, ‘140’ సిరీస్‌తో వస్తే అది మార్కెటింగ్ కాల్ అని తెలిపింది. వీటి నుంచి కాల్స్/ మెసేజ్‌లు వస్తే బ్యాంకు పంపిందని అర్థం.
Similar News
News January 22, 2025
ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్లు మళ్లీ రానున్నాయా?
ఇప్పుడంటే ఇంటర్నెట్ సౌకర్యం పెరిగి జాబ్‌ల వివరాలు చేతి వేళ్ల దగ్గరికొచ్చాయి గానీ, 1970, 80 యువతకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్‌లే దిక్కు. మళ్లీ వాటిని తీసుకొచ్చి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఓ జాబ్ పోర్టల్ తీసుకురానున్నట్లు సమాచారం. అందులో ప్రైవేటు కంపెనీలు ఉద్యోగ ఖాళీలను రిపోర్ట్ చేయాలి. మార్గదర్శకాలు పాటించకపోతే చర్యలు తీసుకునే అవకాశముంది.
News January 22, 2025
USA ఊహించినంత ప్రయోజనం ఉండదు: రఘురామ్ రాజన్
దిగుమతి సుంకాలు పెంచాలనే USA అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన ప్రపంచ ఆర్థిక అసమానతలకు కారణమవుతుందని RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. విదేశాల్లో వస్తువులు చౌకగా ఉన్నందున వాటిని దిగుమతి చేసుకునేటప్పుడు సుంకాలు పెంచి ప్రయోజనాలను పొందాలని USA చూస్తున్నట్లు తెలిపారు. దీంతో విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. సుంకాలపై అమెరికా ఊహించినంత ప్రయోజనకరంగా ఉండదన్నారు.
News January 22, 2025
రంజీ జెర్సీలో మెరిసిన హిట్ మ్యాన్
ముంబై తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు రోహిత్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి జమ్మూకశ్మీర్‌తో జరగనున్న రంజీ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న హిట్‌మ్యాన్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ రంజీ జెర్సీలో మెరిశారు. కొత్త జెర్సీలో ఫేవరెట్ క్రికెటర్‌ను చూసిన ఫ్యాన్స్ రంజీల్లోనూ అదరగొట్టాలని పోస్టులు పెడుతున్నారు. ముంబై జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.