News December 4, 2024
ఈ నంబర్ల నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దు!

+94777455913, +37127913091, +56322553736 నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఫోన్ ఎత్తకూడదని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. +371 (లాత్వియా), +375 (బెలారస్), +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా) వంటి ఇంటర్నేషనల్ కోడ్లతో మొదలయ్యే నంబర్లతో రింగ్ చేసి ఎత్తిన తర్వాత హ్యాంగ్ చేస్తారన్నారు. తిరిగి ఫోన్ చేస్తే బ్యాంక్ వివరాలు కాపీ చేస్తారని, #90, #09 నంబర్లు నొక్కొద్దని హెచ్చరించారు.
Similar News
News November 27, 2025
పన్ను ఊడిపోయిందా? డెంటల్ ఇంప్లాంట్ అవసరం లేదు!

ఊడిపోయిన దంతాల ప్లేస్‌లో కొత్తవి వచ్చే విధంగా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు బయోయాక్టివ్ ప్యాచ్‌ను ఆవిష్కరించారు. ఇది కృత్రిమ దంతాలకు ప్రత్యామ్నాయంగా దవడలోని స్టెమ్ సెల్‌లను చురుకుగా మారుస్తుంది. ఇది పూర్తి దంత నిర్మాణాన్ని సహజంగా పెంచుతుంది. పన్ను పోయిన చోట ఈ ప్యాచ్‌ను అమర్చితే చిగుళ్లలోపలి నుంచి కొత్త పన్ను వస్తుంది. మానవులపై జరిపే క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే ఎంతో మందికి ఇది ఉపయోగపడనుంది.
News November 27, 2025
జీవో 46పై విచారణ రేపటికి వాయిదా

TG: ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఈ జీవో జారీ చేయడంతో వెనుకబడిన కులసంఘాలు పిటిషన్లు వేశాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది సుదర్శన్ అత్యవసర పిటిషన్‌గా విచారణ చేపట్టాలని కోరారు. బీసీలలో A, B, C, D వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.
News November 27, 2025
లడ్డూ విషయంలో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం: YV సుబ్బారెడ్డి

AP: తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తాను 30 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నానని, దేవుడి ప్రతిష్ఠ పెంచేలా పని చేశానని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి ఘటనలో నిజాలు తెలియజేయడానికి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.


