News March 1, 2025
ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టు!

AP: పోసాని కృష్ణమురళికి మరో షాక్ ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఒక కేసులో అరెస్టై, 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. దీనిపై ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. అయితే పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో బెయిల్ దొరికితే మరో కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News March 1, 2025
టన్నెల్ ఘటన.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

TG: శ్రీశైలం SLBC టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్)ను కట్ చేస్తున్నారని, మనుషులు ఉన్నట్లుగా ఆనవాళ్లు ఉన్నచోట తవ్వకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. నలుగురు సిబ్బంది TBM కింద ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. పనులు వేగంగా జరగడం లేదని విమర్శించే వారు లోపలికి వెళ్లి చూస్తే పరిస్థితి అర్థం అవుతుందన్నారు.
News March 1, 2025
సంపద సృష్టిపై నిత్యం ఆలోచిస్తున్నా: సీఎం

AP: కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 12.9% వృద్ధి రేటు సాధించామని CM చంద్రబాబు తెలిపారు. YCP హయాంలో రోడ్లన్నీ గుంతలమయమైతే తాము మరమ్మతులు చేశామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. సంపద ఎలా సృష్టించాలనే దానిపై నిత్యం ఆలోచిస్తున్నామని పునరుద్ఘాటించారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా పేదల జీవితాల్లో మార్పులు తెస్తామని చెప్పారు.
News March 1, 2025
CT ఫైనల్లో ఆ జట్టే గెలుస్తుంది: ఆసీస్ మాజీ కెప్టెన్

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్కు వెళ్తాయని మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. తుది పోరులో ఆస్ట్రేలియాను టీమ్ ఇండియా ఒక్క పరుగు తేడాతో ఓడిస్తుందని జోస్యం చెప్పారు. దుబాయ్లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని, భారత ప్లేయర్లు మంచి ఫామ్లో ఉన్నారని తెలిపారు. కెప్టెన్ రోహిత్ శర్మ అటాకింగ్ గేమ్ భారత్కు కీలకంగా మారనుందన్నారు.