News December 2, 2024
ఇలా చలి కాచుకుంటే చనిపోయే ప్రమాదం

చలికాలంలో మంట వేసుకుని వెచ్చదనం పొందడం చాలామందికి అలవాటు. కానీ కొందరు రాత్రుళ్లు ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకుని వెచ్చదనం పొందే ప్రయత్నం చేయడం ప్రాణాంతకంగా మారుతుంది. బొగ్గుల కుంపటి నుంచి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైయాక్సైడ్, నైట్రోజన్ వల్ల గదిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి శ్వాస తీసుకోలేరు. గతంలో ఇలా కుంపటితో పలువురు ప్రాణాలు కోల్పోగా అరకులోయలో నిన్న ఇద్దరు ఊపిరి వదిలారు.
Share It
Similar News
News November 27, 2025
వరంగల్: బ్యాంకుల్లో నగదుకు కటకట

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బ్యాంకుల్లో నగదుకు కొరత ఏర్పడింది. పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుల నుంచి పోస్టాఫీసులకు నగదు తరలింపు పెద్ద సమస్యగా మారింది. కలెక్టర్లు పక్క జిల్లాల నుంచి సర్దుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా పెన్షన్ల కోసం డబ్బు విడుదల కావట్లేదని సమాచారం. బిహార్ ఎన్నికల కోసం భారీగా నగదును తరలించడంతో సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్క ఆర్బీఐ నుంచి కూడా నగదు సరఫరా లేనట్లు సమాచారం.
News November 27, 2025
సేమ్ ప్రపోజల్: ఇప్పుడు స్మృతి.. అప్పట్లో బీర్వా షా..

స్మృతి మంధానతో వివాహం ఆగిపోవడంతో మాజీ గర్ల్ఫ్రెండ్తో పలాశ్ పాత ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల అతడు స్మృతిని స్టేడియంలోకి తీసుకెళ్లి మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేశారు. 2017లో అచ్చం ఇలాగే మాజీ ప్రియురాలు బీర్వా షాకు కూడా ప్రపోజ్ చేసిన ఫొటోలు బయటికొచ్చాయి. ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకున్న తరుణంలో 2019లో వీరిద్దరూ అనూహ్యంగా విడిపోయారు. ఇప్పుడు స్మృతి-పలాశ్ పెళ్లిపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.
News November 27, 2025
8,868 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

రైల్వేలో 8,868 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ అర్హతతో 5,810 పోస్టులు, ఇంటర్ అర్హతతో 3,058 పోస్టులు ఉన్నాయి. CBT, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ పోస్టులకు 18-33ఏళ్లు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 18-30ఏళ్లవారు అర్హులు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


