News May 12, 2024
ఈ సమయంలో వెళ్తే త్వరగా ఓటేయొచ్చు

మనలో చాలామంది ఓటు వేయకపోవడానికి ప్రధాన కారణం క్యూలో నిలబడడానికి బద్దకం. కానీ ఉదయం 7-9 గంటల మధ్య వెళితే 10-15నిమిషాల్లో ఓటేసి వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. ఆ సమయంలో పెద్దగా లైన్లు ఉండవు. సరైన పత్రాలు తీసుకెళ్లి నేరుగా ఓటేయొచ్చు. 11గంటల తర్వాత ఎలాగూ ఎండ దంచికొడుతోంది. అందుకే 9 లోపు వెళ్లి ఓటేసి వచ్చేయండి. మరో విషయం.. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్ అనుమతించరు. అందుకే ఇంట్లోనే పెట్టి వెళ్లండి.
Similar News
News April 4, 2026
పెళ్లి ప్యాకేజీల్లో వెయిట్ లాస్ ఇంజెక్షన్లు!

పెళ్లికి సిద్ధపడే వధూవరులకు వెల్‌నెస్ క్లినిక్‌లు హెయిర్-స్కిన్ కేర్ ప్యాకేజ్‌లు ఆఫర్ చేయడం కామన్. కానీ ఇప్పుడు ఆ జాబితాలో వెయిట్ లాస్ ఇంజెక్షన్లూ చేరాయి. ఢిల్లీలోని ఓ క్లినిక్ ‘మాంజురో బ్రైడ్’ పేరుతో ప్యాకేజ్ ఆఫర్ చేయడం చర్చనీయాంశమైంది. దేశంలోని అనేక క్లినిక్స్ ఇలాంటి ప్యాకేజ్‌లు ఇస్తున్నాయి. పెళ్లికి త్వరగా బరువు తగ్గాలనుకునే జంటల సంఖ్య పెరగడంతో ఈ ట్రెండ్ పుట్టుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు.
News April 4, 2026
‘రామాయణ’కు ₹700కోట్ల ఓటీటీ ఆఫర్.. రిజెక్ట్ చేసిన ప్రొడ్యూసర్?

‘రామాయణ’ ఓటీటీ హక్కులపై ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం ఓ సంస్థ ఏకంగా ₹700Cr ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దానిని నిర్మాత నమిత్ మల్హోత్రా రిజెక్ట్ చేశారట. ₹4వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ మూవీకి ఓటీటీ రైట్స్‌ను ₹1000Crకు అమ్మాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు టాక్. అలాగే రెండు భాగాలకు వేర్వేరు డిజిటల్ రైట్స్ అమ్మే ఆప్షన్‌నూ మూవీ టీమ్ పరిశీలిస్తోందట.
News April 4, 2026
మరో US జెట్‌ను కూల్చిన ఇరాన్!

ఇప్పటికే అమెరికాకు చెందిన F-35, <<19559906>>F-15<<>> జెట్‌లను కూల్చిన ఇరాన్ తాజాగా మరో ‘A-10 వార్‌థాగ్’ అనే మరో యుద్ధవిమానాన్ని కూల్చినట్లు US మీడియా వెల్లడించింది. హార్ముజ్ జలసంధి సమీపంలో ఇది క్రాష్ అయినట్లు తెలిపింది. అయితే పైలట్ సురక్షితంగా బయటపడినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా కూలిన US జెట్‌ల పైలట్లను ప్రజలు ప్రాణాలతో పట్టుకుని అధికారులకు అప్పగిస్తే రివార్డ్స్ ఇస్తామని ఓ ఇరాన్ ఛానెల్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.


