News September 24, 2025
సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి: నాని

AP: జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ‘వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలి. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఇవ్వకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించాం’ అని తాడేపల్లిలో తెలిపారు. కాగా జగన్ అధ్యక్షతన ఇవాళ తాడేపల్లిలో YCP విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది.
Similar News
News September 24, 2025
SM యాప్స్ భారత చట్టాలను పాటించాల్సిందే: కర్ణాటక హైకోర్టు

X, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ భారత చట్టాలను పాటించాల్సిందేనని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. కొన్ని ఖాతాలు, పోస్ట్‌లను బ్లాక్ చేయాలన్న కేంద్రం ఆదేశాలను సవాలు చేస్తూ X దాఖలు చేసిన పిటిషన్‌లను కొట్టివేసింది. ‘నియంత్రణ, పర్యవేక్షణ లేకుండా SM యాప్‌లను అనుమతించడం కుదరదు. ఆర్టికల్ 19 ప్రకారం దేశంలో భావప్రకటనా స్వేచ్ఛ భారతీయులకు మాత్రమే ఉంది. విదేశీ సంస్థలకు కాదు’ అని ధర్మాసనం పేర్కొంది.
News September 24, 2025
ప్యాకేజ్ ఇస్తే చాలన్నట్లు పవన్ తీరు: రోజా

AP: తన మూవీ టికెట్ రేట్లు పెంచితే చాలు ప్రజలేమైనా పర్లేదన్నట్లు Dy.CM పవన్ తీరుందని మాజీమంత్రి రోజా విమర్శించారు. ‘రైతు మద్దతు ధరలేక అల్లాడుతుంటే పవన్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ప్యాకేజ్ ఇస్తే చాలు, సినిమా రేట్లు పెంచితే చాలన్నట్లు ఉన్నారు. ఒకసారి గెలిపించండి తలరాతలు మారుస్తానని అడుక్కొని గెలిచారు. ఏ ఒక్క వర్గానికైనా ఉపయోగపడ్డారా? షూటింగ్స్ చేసుకోక మీకెందుకు రాజకీయాలు’ అని ఎద్దేవా చేశారు.
News September 24, 2025
మెడికల్ సీట్ల పెంపునకు కేంద్రం ఆమోదం

దేశంలో వైద్య విద్య విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. UG, PG మెడికల్ సీట్ల పెంపునకు అంగీకరించింది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్-3 కింద 5వేల కొత్త PG, 5,023 MBBS సీట్లకు ఆమోదం తెలిపింది. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్ల వరకు నిధులు కేటాయించనుంది. ఈ పథకం ద్వారా Govt వైద్య కళాశాలలు, ఆస్పత్రుల రెనోవేషన్‌కు సాయం, స్పెషలిస్ట్ డాక్టర్ల ప్రవేశానికి మార్గం సుగమంకానుంది.