News July 22, 2024
ఆ స్టేడియంలో సిక్స్ కొడితే ఔట్

బ్యాటర్లు సిక్సులు కొట్టడంపై UKలోని పురాతన సౌత్విక్ అండ్ షోర్హామ్ క్రికెట్ క్లబ్ నిషేధం విధించింది. క్రికెటర్లు కొట్టే సిక్సుల వల్ల తమకు ఆస్తి నష్టం, భద్రతా సమస్యలు వస్తున్నాయని స్టేడియం సమీపంలోని నివాసితుల ఫిర్యాదుతో క్లబ్ ఈ నిర్ణయం తీసుకుంది. వలలు ఏర్పాటు చేసినా బ్యాటర్ల సిక్సుల ధాటికి అవి ఆగడం లేదు. దీంతో మొదటి సిక్స్ కొడితే స్కోరును పరిగణనలోకి తీసుకోరు. రెండోసారి కొడితే ఔట్గా పరిగణిస్తారు.
Similar News
News November 19, 2025
RGM: ‘నషా ముక్త్ భారత్’ నిర్మాణానికి ప్రజలు సహకరించాలి: సీపీ

‘నషా ముక్త్ భారత్’ నిర్మాణానికి ప్రజల సహకారం అత్యంత అవసరమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంగళవారం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని అధికారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా, అమ్మకం వంటి కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సీపీ పిలుపునిచ్చారు.

ఈ గణపతి రూపం బాధలను పోగొడుతుంది

10 చేతులు, 5 తలలు గల హేరంబ గణపతిని దర్శిస్తే కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ గణపతిని ధ్యానించిన తర్వాతే పరమ శివుడు త్రిపురాసురుడుని సంహరించగలిగాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఫలితంగానే స్వర్గంలో ఇంద్రుడు సహా త్రిమూర్తులు తమ స్థానాల్లో ఉండగలిగారట. అందుకే గణపతికి తొలి పూజలు చేస్తారు. ఈయనను కొలిస్తే.. శుభాలు కలుగుతాయని, సంసార సాగరాన్ని సునాయసంగా దాటేయగలరని పండితులు చెబుతున్నారు.