News April 7, 2025
ఆ‘రేంజ్’లో ఊహించుకుంటే..

గత ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని IPL-2025లో SRHపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సారి కప్పు కొడుతుందని ధీమాగా ఉండగా ఆరెంజ్ ఆర్మీ ప్రదర్శన మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది. మొదటి మ్యాచ్ మినహా మిగతా వాటిలో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. భారీ స్కోర్లు అటుంచి కనీసం మ్యాచ్ గెలిచే ప్రదర్శన చేయలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా సమష్టిగా రాణిస్తే అంచనాలను అందుకోవచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Similar News
News April 10, 2025
కాంగ్రెస్ రెండో స్వాతంత్ర్య పోరాటం చేస్తోంది: ఖర్గే

అహ్మదాబాద్లో ముగిసిన ఏఐసీసీ సమావేశాల్లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రధాని మోదీ ఏదో రోజు దేశాన్ని అమ్మేస్తారు. భారత సంపదను తన మిత్రులకు ధారపోస్తున్నారు. బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ రెండో స్వాతంత్ర్య ఉద్యమాన్ని చేస్తోంది. ఎన్నికల్లోనూ ఈవీఎంల సాయంతో పచ్చిగా మోసాలకు పాల్పడుతోంది. అందుకే 90శాతం సీట్లు గెలిచారు’ అని ఆయన ఆరోపించారు.
News April 10, 2025
మీ టార్గెట్ నేనే అని తెలుసు: సీఎం పినరయి

తనను లక్ష్యంగా చేసుకునే తన కుమార్తెపై కేంద్రం అవినీతి కేసుల్ని బనాయించిందని కేరళ CM పినరయి విజయన్ ఆరోపించారు. ఏం చేసినా తాను వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ‘మీకు నా రక్తం కావాలని నాకు తెలుసు. కానీ మా అమ్మాయిపై SFIO చేపట్టిన దర్యాప్తును మా పార్టీ తీవ్రంగా పరిగణించడం లేదు. కాబట్టి నా రాజీనామా కోసం మీరు చూస్తున్నట్లైతే అది రావడం కష్టం. కేసును చట్టప్రకారం ఎదుర్కొంటాం’ అని తేల్చిచెప్పారు.
News April 10, 2025
మా సైనికులెవరూ ‘ఉక్రెయిన్’ యుద్ధంలో లేరు: చైనా

చైనా సైనికులు <<16037933>>రష్యా తరఫున ఉక్రెయిన్ యుద్ధంలో <<>>పాల్గొంటున్నారన్న ఉక్రెయిన్ ఆరోపణల్ని బీజింగ్ ఖండించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవంటూ తోసిపుచ్చింది. ‘సాయుధ పోరాటాలు జరుగుతున్న చోటి నుంచి దూరంగా ఉండాలని మేమే మా పౌరులకు చెబుతుంటాం. అలాంటిది యుద్ధానికి పంపుతామా? ఈ యుద్ధంలో మేం తటస్థంగా మాత్రమే ఉన్నాం. ఏ వైపునకూ మా మద్దతు లేదు’ అని తేల్చిచెప్పింది.