News August 28, 2024
ఇంట్లో తాబేలు బొమ్మ పెట్టుకుంటే..

తాబేలు ఇంటికి అదృష్టం తెస్తుందని నమ్మకం. వాస్తు ప్రకారం టార్టాయిస్ బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సంపద, శక్తి, వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో క్రమశిక్షణను తెస్తుంది. పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది. అనుబంధాలు పెరుగుతాయి. అందుకే ఆలయాల్లో, పూర్వకాలంలో బావుల్లో తాబేలు ఉంచేవారని చెబుతారు.
Similar News
News December 2, 2025
NGKL: సర్పంచ్ ఎన్నికలు.. బరిలో నిలిచేదేవరో, తప్పుకునేదెవరో..?

NGKL జిల్లాలో దాదాపు రెండేళ్ల తర్వాత జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొన్ని గ్రామాల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు ఆశావహులు నామినేషన్లు వేయడంతో నాయకులకు తలనొప్పిగా మారింది. ఓట్లు చీలకుండా నివారించేందుకు.. ఒక్కరినే బరిలో దించడానికి, నామినేషన్ల ఉపసంహరణకు నేతలు బుజ్జగింపులు మొదలుపెట్టారు. రేపటితో తొలి విడతలో బరిలో నిలిచేది ఎవరో తేలనుంది.
News December 2, 2025
CTETకు దరఖాస్తు చేశారా?

CTET అర్హత కోసం అభ్యర్థుల నుంచి CBSE దరఖాస్తులు కోరుతోంది. B.Ed, D.Ed, B.EI.Ed, D.Ed, D.EI.Ed అర్హతగల వారు DEC 18 వరకు అప్లై చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఏకలవ్య స్కూల్స్, రాష్ట్ర స్థాయిలో టీచర్ ఉద్యోగాలకు పోటీపడాలంటే CTET ఉత్తీర్ణత తప్పనిసరి. FEB 8న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200. SC/ST/ PWBDలకు రూ.500, రెండు పేపర్లకు రూ.600. ctet.nic.in/
News December 2, 2025
చర్మ ఆరోగ్యానికి టమాటా

ముఖంపై మచ్చలు, మొటిమలు, గుంతలు వంటి సమస్యలకు టమాటా పరిష్కారం చూపుతుందంటున్నారు చర్మ నిపుణులు. * టమాటా రసం, నిమ్మరసం కలిపి, దీంట్లో దూదిని ముంచి ముఖానికి అప్త్లె చేసుకొని మసాజ్ చేసుకోవాలి. పావుగంట తర్వాత కడిగేస్తే ఓపెన్ పోర్స్ తగ్గుతాయి. *టమాటా రసంలో శనగపిండి, నిమ్మరసం, తేనె కలిపి, ఈ మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో రాసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.


