News October 6, 2025

బిహార్ అసెంబ్లీ ముఖచిత్రం చూస్తే..

image

UP, బెంగాల్, మహారాష్ట్ర తర్వాత నాలుగో అత్యధిక అసెంబ్లీ స్థానాలు(243)న్న బిహార్‌కు ఇవాళ సాయంత్రం గం.4కు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 2020 ఎన్నికల్లో NDA 125, INDIA 110, ఇతరులు 8 స్థానాలు పొందాయి. ఓటుబ్యాంకు: NDA 37.26%, INDIA 37.23%. 20% స్థానాల్లో గెలుపు-ఓటముల తేడా 2.5%లోపే. NDA ఇలా 21, INDIA 22 సీట్లు పొందాయి. రెండు కూటముల మధ్య పోటీతో వేవ్‌ స్వింగ్ అయ్యే ఈ సీట్లే అధికారాన్ని నిర్ణయిస్తాయి.

Similar News

News October 6, 2025

ప్రభుత్వ వైఫల్యంతోనే కరూర్ తొక్కిసలాట : NDA MPలు

image

కరూర్(TN) తొక్కిసలాటలో 41 మరణాలపై NDA MPలు నివేదిక రూపొందించారు. ప్రభుత్వ వైఫల్యమే కారణమని తేల్చారు. జనాల సంఖ్యపై అంచనాలేమి, క్రౌడ్ మేనేజ్మెంటులో వైఫల్యం ఉందన్నారు. 3వేల మంది పట్టే గ్రౌండ్‌లో 30వేల మంది గుమిగూడారు. 2 గం.కు రావలసిన విజయ్ రాత్రి 7 గం.కు వచ్చారు. ఆయన బస్సుపైకెక్కి అభివాదం చేస్తుండగా తొక్కిసలాట జరిగింది. నివారించదగ్గదే అయినా అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్ల ఇది జరిగిందని పేర్కొన్నారు.

News October 6, 2025

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే

image

❂ అక్టోబర్ 8: మెయింటెనెన్స్ రిక్వైర్డ్(ప్రైమ్ వీడియో)
❂ అక్టోబర్ 9: వార్ 2(నెట్‌ఫ్లిక్స్-సినీ వర్గాల సమాచారం)
❂ అక్టోబర్ 10: మిరాయ్(జియో హాట్‌స్టార్)
❂ త్రిబాణధారి బార్బరిక్(సన్ నెక్స్ట్)
❂ స్థల్(జీ 5)
❂ స్విమ్ టు మీ(నెట్‌ఫ్లిక్స్)

News October 6, 2025

ఈ నెల 10న క్యాబినెట్ భేటీ

image

AP: వారం వ్యవధిలోనే మంత్రి వర్గం <<17905338>>మరోసారి<<>> సమావేశం కానుంది. ఈ నెల 10న సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరగనుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది.