News June 10, 2024
విజయవాడలో ఓడితే రాజకీయ సన్యాసమేనా!

విజయవాడ MP సీటులో ఓడిపోయిన నేతలు రాజకీయాలకు దూరమైపోతున్నారు. 2014లో కోనేరు రాజేంద్రప్రసాద్, 2019లో ప్రసాద్ వి పొట్లూరి ఓడిపోగా పొలిటికల్ కెరీర్‌కు ముగింపు పలికారు. తాజాగా ఓడిపోయిన కేశినేని నానీ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ముగ్గురూ YCP అభ్యర్థులే కావడం గమనార్హం. గతంలో ఇక్కడ 2 సార్లు గెలిచిన లగడపాటి రాష్ట్ర విభజన తర్వాత (2014) పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పేశారు.
Similar News
News September 13, 2025
హైదరాబాద్ మిధానీలో ఉద్యోగాలు

HYDలోని మిశ్ర ధాతు నిగమ్<
News September 13, 2025
యుద్ధం తర్వాత తొలి మ్యాచ్.. స్టేడియం హౌస్‌ఫుల్: అక్తర్

ఆసియా కప్‌లో రేపు భారత్‌తో జరగనున్న మ్యాచ్‌కు టికెట్స్ సేల్ అవ్వట్లేదన్న వార్తలపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించారు. ‘భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. యుద్ధం తర్వాత భారత్‌తో పాక్ తొలిసారి తలపడుతోంది. కచ్చితంగా స్టేడియం హౌస్‌ఫుల్ అవుతుంది. టికెట్లు అమ్ముడవ్వట్లేదని నాతో ఒకరన్నారు. అది వాస్తవం కాదని, అన్నీ సేల్ అయ్యాయని చెప్పాను. ఇదంతా బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే’ అని వ్యాఖ్యానించారు.
News September 13, 2025
జగన్.. మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం ఆపండి: సత్యకుమార్

AP: మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం ఆపాలని YS జగన్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు. 17 కాలేజీలు తెచ్చానని జగన్ అనడం అబద్ధమన్నారు. రూ.8,450 కోట్లతో మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి, రూ.1,451 కోట్లకే బిల్లులు చెల్లించారని తెలిపారు. కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకురాలేకపోయారని విమర్శించారు. జగన్‌లా తాము విఫలం కావొద్దని PPPని ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. పీపీపీకి, ప్రైవేటీకరణకు తేడా ఉందని చెప్పారు.