News August 28, 2024
ఈ ఎడారిలో దారి మరిస్తే అంతే సంగతులు!

ఇటీవల తెలంగాణకు చెందిన ఓ యువకుడు రబ్ అల్ ఖలి ఎడారిలో దారి తప్పి మరణించాడు. కాగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రమాదకరమైన ఎడారి. 650 కి.మీ పొడవున సౌదీ, ఒమన్, యెమెన్, UAE దేశాల్లో ఇది విస్తరించి ఉంది. భారీ ఇసుక దిబ్బలు, ప్రమాదకర పాములు ఉంటాయి. ఇక్కడ తాగేందుకు గుక్కెడు నీరు కూడా ఉండదు. దారి తప్పిన వారికి సాయం చేసేందుకు ఎవరూ ఉండరు. ఇప్పటివరకు దీనిని దాటినవారిని వేళ్ల మీదనే లెక్కించొచ్చు.
Similar News
News November 24, 2025
హెజ్బొల్లా జనరల్ స్టాఫ్ చీఫ్ హతం: IDF

హెజ్బొల్లా జనరల్ స్టాఫ్ చీఫ్ హయతం అలీ తబతబాయిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. బీరూట్‌లో జరిపిన దాడుల్లో అతడు మరణించినట్లు పేర్కొంది. 1980లో హెజ్బొల్లాలో చేరిన తబతబాయి సిరియా ఆపరేషన్స్‌కు హెడ్‌గా, రాడ్వన్ ఫోర్స్‌కు కమాండర్‌గా పనిచేశాడని తెలిపింది. హెజ్బొల్లా గ్రూప్‌లో ఇతడు నంబర్ 2 లీడర్ అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ దాడుల్లో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు సమాచారం.
News November 24, 2025
నవంబర్ 24: చరిత్రలో ఈరోజు

1880: ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జననం(ఫొటోలో)
1897: హాస్యనటుడు వంగర వెంకటసుబ్బయ్య జననం
1924: సినీ దర్శకుడు తాతినేని ప్రకాశరావు జననం
1952: మాజీ క్రికెటర్ బ్రిజేశ్ పటేల్ జననం
1953: రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జననం.
1961: రచయిత్రి అరుంధతీ రాయ్ జననం
1981: స్వరాజ్య సంఘం స్థాపకుడు రాఘవయ్య మరణం
2018: కన్నడ నటుడు అంబరీశ్ మరణం
News November 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


