News September 4, 2024

మీరు కామెంట్స్ చేస్తే సినిమాకు దెబ్బ: తమన్

image

సంగీత దర్శకుడు తమన్ ట్విటర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో వచ్చే కొత్త అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌కు బ్లాస్టేనంటూ పేర్కొన్నారు. ‘సినిమాపై ప్రతికూల ట్రెండ్స్ వ్యాప్తి చేయకండి. అది మూవీని మరింత దెబ్బతీస్తుంది. దీనిపై భారీగా డబ్బు, సమయాన్ని వెచ్చించారు. ఫ్యాన్స్ మాకు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి’ అని కోరారు. పేరు చెప్పనప్పటికీ.. గేమ్‌ఛేంజర్‌ను ఉద్దేశించే ఆయన ట్వీట్ చేశారని చరణ్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.

Similar News

News January 15, 2025

యుద్ధ నౌకలు జాతికి అంకితం

image

భారత నేవీ అమ్ములపొదిలో మూడు అత్యాధునిక యుద్ధ నౌకలు చేరాయి. INS సూరత్, INS నీలగిరి యుద్ధ నౌకలు, వాఘ్‌షీర్ జలాంతర్గామి(సబ్ మెరైన్)ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ముంబై డాక్ యార్డులో ఈ కార్యక్రమం జరిగింది. రక్షణరంగంలో మేకిన్ ఇండియా ఆవిష్కృతమవుతోందని మోదీ అన్నారు. ప్రపంచంలో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని చెప్పారు.

News January 15, 2025

ఆ యాప్ బ్యాన్.. పిచ్చెక్కిపోతున్న యువత

image

అమెరికాలో ఈ నెల 19 నుంచి టిక్‌టాక్ బ్యాన్ కానుందనే వార్తల నేపథ్యంలో ఆ దేశ యువత ప్రత్యామ్నాయ యాప్స్‌పై ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో చైనాకు చెందిన Xiaohongshu యాప్ అమెరికా డౌన్‌లోడ్ లిస్టులో టాప్‌లో ఉంది. 2 రోజుల్లోనే 7 లక్షల డౌన్‌లోడ్స్ వచ్చాయి. ఈ యాప్‌కు చైనాలో 300 మిలియన్ల యూజర్లు ఉన్నారు. కాగా అమెరికా జనాభాలో సగం మంది అంటే 170 మిలియన్ల మంది (17 కోట్లు) టిక్‌టాక్ వాడుతుండటం గమనార్హం.

News January 15, 2025

‘కల్కి-2’ రిలీజ్ అయ్యేది అప్పుడే: అశ్వనీదత్

image

‘కల్కి-2’ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తామని నిర్మాత అశ్వనీదత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. సీక్వెల్‌లో ప్రభాస్, అమితాబ్, కమల్ ముగ్గురే ఎక్కువగా కనిపిస్తారని చెప్పారు. దీపిక పాత్రకూ ఇంపార్టెన్స్ ఉంటుందన్నారు. అవసరమైతేనే కొత్త పాత్రలను పరిచయం చేస్తామన్నారు. నాగ్ అశ్విన్ ఆలోచించే తీరు, దర్శకత్వ విధానం గొప్పగా ఉంటాయని ప్రశంసించారు.