News September 18, 2024

MPగానే పెళ్లి చేసుకుంటా: కంగనా రనౌత్

image

సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటానని హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. ఎంపీగా పదవిలో ఉండగానే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. దేవుడి దయ వల్ల అది జరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా 38 ఏళ్ల కంగన హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి ఎంపీగా గెలుపొందారు. మరోవైపు ఆమె నటించిన ‘ఎమర్జెన్సీ’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Similar News

News February 2, 2026

గ్రామీ వేడుకల్లో ఇండియన్ టచ్

image

ప్రపంచ సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ కెల్సియా బాలేరిని డిజైనర్ సబ్యసాచి చెవి రింగులు, ఉంగరం ధరించగా, సింగర్, సాంగ్ రైటర్ రాజా కుమారి సబ్యసాచి శారీని ధరించారు. భారతీయ, శ్రీలంక మూలాలు కలిగిన సింగర్ లారా రాజ్ ఓం లాకెట్‌తో పాటు పాపిడి బిళ్ల ధరించి మెరిసిపోయారు.

News February 2, 2026

లోక్‌సభ రేపటికి వాయిదా

image

లోక్‌సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ నేతలు అభ్యంతరం చెప్పడంతో సభలో గందరగోళం నెలకొంది. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, వాస్తవాలు మాట్లాడితే తన గొంతు నొక్కుతున్నారని రాహుల్ విమర్శించారు. దీనిపై మోదీ, రాజ్‌నాథ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

News February 2, 2026

ఈ వారం థియేటర్&OTTల్లోకి రానున్న చిత్రాలివే..

image

ఈ వారం థియేటర్లలో ‘యుఫోరియా(డైరెక్టర్ గుణశేఖర్), ‘సుమతీ శతకం’, ‘శ్రీ చిదంబరం గారు’, ‘హనీ’, ‘ఆపరేషన్ పద్మ’, ‘లగ్గం టైం’, ‘విత్ లవ్’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి.
*అమెజాన్ ప్రైమ్-నారీ నారీ నడుమ మురారి (ఫిబ్రవరి 4), *జియో హాట్ స్టార్ – ది రాజా సాబ్ (ఫిబ్రవరి 4), *జీ5- పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ – ఫిబ్రవరి 7), * ఆహా – సైక్ సిద్ధార్థ (ఫిబ్రవరి 4), * సన్ నెక్స్ట్ – నీలకంఠ (ఫిబ్రవరి 6).