News August 9, 2025

మతం దాచి పెళ్లి చేసుకుంటే జైలుకే.. హరియాణా చట్టం

image

మతాన్ని దాచి పెళ్లి చేసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరియాణా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మతమార్పిడికి పాల్పడినా, పెళ్లి కోసం మతం మార్చుకోవాలని అడిగినా ₹4లక్షల జరిమానా, పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. మతస్వేచ్ఛను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని, ఆ పేరుతో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. చట్టబద్ధంగా అనుమతి పొందాకే మత మార్పిడి చేసుకోవాలంది.

Similar News

News August 9, 2025

ఎల్లుండి ‘మాస్ జాతర’ టీజర్

image

మాస్ మహారాజా రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కించిన ‘మాస్ జాతర’ మూవీ నుంచి కొత్త అప్‌డేట్ వచ్చింది. ఆగస్టు 11న ఉదయం 11.08 గంటలకు ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఆకట్టుకుంటున్నాయి. నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా ఈ నెల 27న రిలీజ్ కానుంది.

News August 9, 2025

OBCల క్రీమీలేయర్‌ను సవరించాలని ప్రతిపాదన

image

OBCల క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని వెంటనే సవరించాలని పార్లమెంటరీ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఉన్న రూ.8 లక్షల పరిమితిని పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుత పరిమితి వల్ల చాలామంది రిజర్వేషన్లు, ప్రభుత్వం అందించే పథకాలను కోల్పోతున్నారంది. 2017లో వార్షిక పరిమితిని రూ.6.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు సవరించారని, దీనిని ప్రతి మూడేళ్లకోసారి సవరించాల్సి ఉందని గుర్తు చేసింది.

News August 9, 2025

మహేశ్ బర్త్‌డే.. రాజమౌళి సినిమాపై బిగ్ అప్డేట్

image

మహేశ్‌తో తెరకెక్కిస్తున్న సినిమాపై డైరెక్టర్ రాజమౌళి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోందని చెప్పారు. 2025 నవంబర్‌లో మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ రివీల్ చేయనున్నట్లు తెలిపారు. ‘ఇది ఇంతకుముందు ఎన్నడూ చూడనటువంటిది’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. మెడలో నందీశ్వరుడితో కూడిన త్రిశూలం లాకెట్ ధరించిన మహేశ్ ఛాతీ పిక్ షేర్ చేశారు. తమ మూవీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.