News March 13, 2025
₹2,100 చెల్లిస్తే ₹5,00,000.. నిజమిదే!

ప్రధానమంత్రి ముద్ర యోజనపై తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ₹2,100 చెల్లిస్తే ₹5,00,000 ఋణం మంజూరు చేస్తున్నట్లు ఓ నకిలీ ఆమోదిత లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని పేర్కొంది. ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. రీఫైనాన్సింగ్ ఏజెన్సీ ముద్రా ఋణాలను సూక్ష్మ వ్యవస్థాపకులు/వ్యక్తులకు నేరుగా ఇవ్వదని తెలిపింది.
Similar News
News February 6, 2026
శ్రీవారి నేత్ర దర్శనం ఏరోజు ఉంటుందంటే?

శ్రీ వేంకటేశ్వర స్వామి నేత్రాలు అత్యంత శక్తివంతమైనవి. అలాగే ప్రకాశవంతమైనవి కూడా! ఆ విశ్వశక్తిని సామాన్య మానవులు నేరుగా చూడలేరు. అందుకే స్వామివారి కళ్లను ఎప్పుడూ పచ్చకర్పూరంతో కప్పి ఉంచుతారు. కేవలం గురువారం నాడు మాత్రమే ఆయన కళ్లను చూడవచ్చు. ఆనంద నిలయంలో ప్రతి గురువారం ‘నిజరూప దర్శనం’ సమయంలో మాత్రమే ఆ కర్పూర నామాన్ని తగ్గించి స్వామివారి నేత్రాలను చూసే అవకాశం కల్పిస్తారు.
News February 6, 2026
తొందరపడుతున్న బంగ్లాదేశ్.. వెల్లువెత్తుతున్న విమర్శలు

భారత్-US ట్రేడ్ డీల్ తర్వాత బంగ్లాదేశ్ కూడా అగ్రరాజ్యంతో ‘సీక్రెట్’ ఒప్పందం కోసం తొందరపడుతోంది. ఈ నెల 12న ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 9వ తేదీన హడావుడిగా ఒప్పందంపై సైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ట్రేడ్ డీల్ అంటే పలుమార్లు చర్చిస్తారు. అందులోని విషయాలను ప్రజలు, పారిశ్రామికవేత్తలతో పంచుకుంటారు. ఇవేవీ లేకుండా రహస్యంగా డీల్‌కు రెడీ అవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News February 6, 2026
కుప్పకూలిన బిట్‌కాయిన్ ధర

క్రిప్టో కరెన్సీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. గత OCTలో రికార్డు స్థాయిలో $1,26,272కు చేరిన బిట్‌కాయిన్ ధర $60,033కు పడిపోయింది. క్రిప్టో ఫ్రెండ్లీగా పేరున్న ట్రంప్ US అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పెరుగుదల కనిపించినా క్రమంగా తిరోగమనం మొదలైంది. రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లను షేక్ చేస్తుండటంతో రిస్క్ తీసుకోవడానికి ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. దీంతో పతనం ప్రారంభమైంది.


