News March 13, 2025
₹2,100 చెల్లిస్తే ₹5,00,000.. నిజమిదే!

ప్రధానమంత్రి ముద్ర యోజనపై తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ₹2,100 చెల్లిస్తే ₹5,00,000 ఋణం మంజూరు చేస్తున్నట్లు ఓ నకిలీ ఆమోదిత లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని పేర్కొంది. ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. రీఫైనాన్సింగ్ ఏజెన్సీ ముద్రా ఋణాలను సూక్ష్మ వ్యవస్థాపకులు/వ్యక్తులకు నేరుగా ఇవ్వదని తెలిపింది.
Similar News
News March 22, 2025
విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం

AP: విశాఖ మేయర్ వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలుగా కూటమి నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీంతో YCPకి షాక్ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. GVMCలో 98 స్థానాలుండగా, YCP 59 చోట్ల గెలిచింది. ఈ 9 నెలల్లో 28 మంది కూటమి పార్టీల్లో చేరడంతో YCP బలం పడిపోయింది. మేయర్‌కు నాలుగేళ్ల పదవీకాలం పూర్తవడంతో మున్సిపల్ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానానికి మార్గం సుగమమైంది.
News March 22, 2025
25 ఏళ్ల వరకూ డీలిమిటేషన్ ఉండొద్దు: స్టాలిన్

తమిళనాడు CM స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో డీలిమిటేషన్‌పై జరిగిన అఖిలపక్ష సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. అనంతరం స్టాలిన్ మాట్లాడారు. ‘25 ఏళ్ల వరకూ నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదని తీర్మానించాం. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో రెండో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. కొన్ని కారణాల వల్ల TMC హాజరు కాలేదు. జగన్ కూడా మా వెంటే ఉన్నట్లు భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News March 22, 2025
అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ.175 కోట్లు?

‘పుష్ప-2’ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశంలోనే హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్‌గా దూసుకెళుతున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీతో తీసే మూవీకి బన్నీ రూ.175 కోట్లు తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. దీంతోపాటు లాభాల్లో 15% వాటా ఇచ్చేలా ‘సన్ పిక్చర్’తో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా అక్టోబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు టాక్.